For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ 'ఇద్దరు అమ్మాయిలతో....' (కొత్త లీక్డ్ ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందతున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో'. ఈ చిత్రంపై అభిమానులలో చాలా అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ కాస్ట్యూమ్స్,గెటప్స్ దగ్గరనుంచి విభిన్నత చూపించాడనే వార్త ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేస్తోంది. ఈ నేఫధ్యంలో ఈ చిత్రానికి సంభందించిన ఫోటోలు ఇప్పుడు నెట్ లో సర్కులేట్ అవుతున్నాయి. అయితే ఇవి అఫీషియల్ గా విడుదల చేసినవి కావు కానీ ప్రొపర్ సోర్స్ ద్వారానే వచ్చినవి అయ్యిండవచ్చు.

  సినిమా స్టోరీలైన్ విషయానికొస్తే.... ఒకే కుర్రాడు ఇద్దరమ్మాయిలతో ప్రేమలో పడి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ సినిమా సాగుతుందని టాక్. 'ఇడియట్‌', 'దేశముదురు' తరవాత ఓ పూర్తిస్థాయి ప్రేమ కథని తెరపై చూపిస్తున్నారు పూరి.

  అల్లు అర్జున్ సరసన అమలాపాల్‌, కేథరీన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ అభిమాన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్‌ దీనికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌ వర్మ.

  ఈచిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండనున్నాయి.

  థాయ్ ఫైట్ మాస్టర్ కెచే కంపక్డీ కంపోజ్ చేసిన ఫైట్స్ హైలెట్ కానున్నాయి.

  చిత్రం రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ బండ్ల గణేష్ ట్వీట్...‘ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని మే 10న విడుదల చేస్తున్నాం. బన్నీ కెరీర్లోనే నెం.1 చిత్రం అవుతుంది. ఈ చిత్రం తీస్తున్న పూరి అన్నయ్యకు థాంక్స్' అంటూ బండ్ల గణేష్ ట్వీట్ చేసారు.

  శర వేగంగా సాగుతున్న ఈచిత్రం ప్రస్తుతం స్పెయిన్లో షూటింగ్ జరుపుకుంటోంది.

  స్పెయిన్ దేశంలో ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రానికి సంబంధించిన మేజర్ పార్ట్ చిత్రీకరిస్తున్నారు.

  అల్లు అర్జున్ తొలిసారిగా ఈచిత్రంలో శరీరంపై టాటూలు వేసుకుని కనిపించనున్నాడు.

  ఈ చిత్రంంలో...అల్లు అర్జున్ పాత్ర డిఫెరెంట్ గా సాగుతుంది. ఒకేసారి ఇద్దరికి లైన్ వేస్తూంటారు. ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడదు. అయినా ఒకరికి తెలీయకుండా మరొకరికి గాలం వేశాడు. టైమ్‌ టేబుల్‌ ప్రకారం ఇద్దరి దగ్గరా ప్రేమ పాఠాలు వల్లించాడు ఈ అల్లరి ప్రేమికుడు. అయితే అందుకు ఓ కారణం ఉంది. అదేమిటి? ఇద్దరమ్మాయిలను ఒకేసారి ప్రేమలోకి ఎందుకు దించాల్సి వచ్చింది? ఈ విషయాలు తెలియాలంటే 'ఇద్దరమ్మాయిలతో' సినిమా చూడాల్సిందే అంటున్నారు.

  అల్లు అర్జున్ ఒకేసారి ఇద్దరమ్మాయిల్ని ప్రేమలోకి దింపేస్తున్నారు. అల్లుఅర్జున్‌తో అమలాపాల్‌, కేథరిన్‌ ఆడిపాడనున్నారు.

  దేశముదురు తర్వాత అల్రు అర్జున్, పూరీ జగన్నాధ్ కాంబినేషన్ రిపీట్ కావటం, జులాయి చిత్రం తర్వాత అల్లు అర్జున్ చేస్తున్న చిత్రం కావటం ఆ అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

  ఈ చిత్రంలో ఐటం బాంబ్ గా..బాలీవుడ్ నటి దేవషి కందూరిని ఎంపిక చేసారు. ఆమెపై స్పెషల్ గా రీసెంట్ గా స్పెయిన్ లో ఓ పాటను చిత్రీకరించారు. గణేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ సాంగ్ సినిమాకు హైలెట్ అవుతుందని చెప్తున్నారు.

  English summary
  Allu Arjun's Iddarammayilatho, which been progressing briskly in Spain, has reached the final leg of shooting. The post production works of the film have already been started and the supporting artists of the film are completing their dubbing part. Iddarammayilatho is extensively shot in Spain and Allu Arjun paired up with two beautiful actresses.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X