For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'ఇద్దరమ్మాయిలతో' చిత్రం ప్రారంభోత్సవ విశేషాలు

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఇద్దరు హీరోయిన్స్ తో అల్లు అర్జున్ తొలిసారి నటిస్తున్న చిత్రం 'ఇద్దరమ్మాయిలతో' బుధవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో మొదలైంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బండ్ల శివబాబు సమర్పణలో బండ్ల గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమలాపాల్‌, రిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్ .ముహూర్తపు సన్నివేశానికి పారిశ్రామికవేత్త బాలాజీరావు క్లాప్‌నిచ్చారు. గణేష్ తండ్రి బండ్ల నాగేశ్వరరావు కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. శ్రీను వైట్ల గౌరవ దర్శకత్వం వహించారు.

  అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణేష్ మాట్లాడుతూ -''పూరి అన్ని చిత్రాల్లోకెల్లా ఇది వ్యత్యాసంగా ఉంటుంది. బన్నీతో సినిమా చేయాలని ఎప్పట్నుంచో అరవింద్‌గారిని అడుగుతున్నాను. బన్నీ నా రోల్ మోడల్. చాలా కష్టపడతాడు. 'నాయక్' కోసం అమలాపాల్ చేసిన డాన్స్ చూశాను. బ్రహ్మాండంగా చేసింది. మా బేనర్‌లో ఇది మరో సూపర్‌హిట్ మూవీ అవుతుంది. పూరి జగన్నాథ్‌తో సినిమా చేయాలని నాలుగేళ్లుగా అనుకుంటున్నాను. నిర్మాతగా నా కెరీర్‌ ఆయనతోనే మొదలుకావాల్సింది. ఇప్పటికి కుదిరింది. వచ్చే నెల తొలి వారం నుంచి చిత్రీకరణ మొదలుపెడతామ'' అన్నారు.

  అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''కథ గురించి ఇప్పుడే ఏమీ చెప్పను. నాకెంతో నచ్చింది. ఎప్పట్నుంచో సినిమా చేద్దాం అని గణేష్ అడుగుతున్నారు. ఈ చిత్రంతో కుదిరింది. ఒక మంచి నిర్మాతకు కావల్సిన అన్ని లక్షణాలు గణేష్‌లో ఉన్నాయి. 'దేశముదురు' సమయంలో నేను సిక్స్‌ప్యాక్ చేయగలిగానంటే దానికి కారణం జగన్‌గారే. చెప్పిన సమయానికి షూటింగ్‌కి ప్యాకప్ చెప్పి, నాకు వర్కవుట్లు చేసుకునే అవకాశం కల్పించేవారు'' అన్నారు.

  పూరి చిత్రం గురించి చెబుతూ ''ఇదో ప్రేమ కథా చిత్రం. బన్నీ అంటేనే ఎనర్జీ. తనే కాదు సెట్‌లో అందర్నీ ఉత్సాహంగా ఉరకలేయిస్తారు. ఈ కథను అల్లు అరవింద్‌కు చెప్పినపుడు మావాడికి బాగుంటుందని చెప్పారు. తెలుగులో తొలి సిక్స్ ప్యాక్ హీరో. ఈ సినిమా కథను బన్నీకి చెప్పినప్పుడు.. మనమే చేద్దాం అన్నాడు. ఆ తర్వాత అరవింద్‌గార్ని కలిసినప్పుడు 'బన్నీకి ఒక కథ చెప్పావట.. అది తనతోనే చెయ్యి. తనకు బాగా నచ్చింది' అన్నారు. ఇది లవ్‌స్టోరి. నవంబర్ మొదటి వారంలో షూటింగ్ ఆరంభిస్తాం. న్యూజిల్యాండ్, ఆస్ట్రేలియాలో ఎక్కువ శాతం షూటింగ్ చేస్తాం''అన్నారు.

  ఇంత మంచి టీమ్‌తో సినిమా చేయడం ఆనందంగా ఉందని అమలాపాల్ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: శ్యామ్‌.కె.నాయుడు, నృత్యాలు: దినేష్‌, కళ: చిన్నా, కూర్పు: ఎస్‌.ఆర్‌.శేఖర్‌, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌. కో-రైటర్స్: బి.వి.ఎస్. రవి, కళ్యాణ్‌వర్మ.

  English summary
  Allu Arjun's new movie Iddarammailatho was launched on Wednesday (October 17, 2012) at Ramanaidu Studios in Hyderabad. A formal pooja ceremony was performed by the film's prominent cast and crew and the regular shooting will commence from the second week of November. The romantic entertainer will be directed by Puri Jagannath and produced by Bandla Ganesh under Parameswara Arts. Amala Paul is playing one of the female leads in the film while the second heroine is yet to be announced. Iddarammailatho will be majorly shot in Barcelona (Spain). Devi Sri Prasad is providing the tunes.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X