»   » బద్రీనాధ్ పాటలో అల్లు అర్జున్ కి గాయం..రెస్ట్

బద్రీనాధ్ పాటలో అల్లు అర్జున్ కి గాయం..రెస్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజా చిత్రం బద్రీనాధ్ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లో షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన నిన్న షూటింగ్ లో ఓ చిన్న ప్రమాదం జరిగింది. డాన్స్ చేస్తున్నప్పుడు ఓ కాంప్లెక్స్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తూంటే బన్నీ..భుజం కండరం పట్టేసింది. దాంతో డాక్టర్స్ అన్ని పరీక్షలు నిర్వహించి లోపల చిన్న గాయమే అయ్యిందని, నాలుగైదు రోజులు పాటు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇక అల్లు అర్జున్ రోజూ ఈ చిత్రం కోసం వియాత్నం వెళ్ళి నేర్చుకొచ్చిన ఫైట్స్ అన్నీ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక మనాలిలో దాదాపు 60 రోజుల పాటు నాన్ స్టాప్ షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఈ హైదరాబాద్ లో షెడ్యూల్ లో ఫైట్స్ సీన్స్, ఓ పాట ఉన్నాయి. కంటిన్యూగా మూడు వారాల పాటు షెడ్యూల్ వేసారు. ఇక అల్లు అర్జున్ రెస్ట్ తీసుకోవటానకి రెడీ అవటంతో నాన్ స్టాప్ గా జరుగుతున్న యూనిట్ కి కాస్త రిలీఫ్ దొరికినట్లయింది. అల్లు అర్జున్ తో డాన్స్ చేయాల్సిన డాన్సర్స్..చెన్నైకి పంపబడ్డారు. ఈ వారంలోనే మళ్ళీ షూటింగ్ ప్రారంభం అవుతుంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu