»   » షూటింగ్ లో గాయపడ్డ అల్లు అర్జున్!

షూటింగ్ లో గాయపడ్డ అల్లు అర్జున్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వలో డివివి దానయ్య నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'వరుడు" లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ఫైట్స్ ని చిత్రీకరిస్తున్నప్పుడు అతని చేతికి గాయం అయ్యిందట. దాంతో కొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా డాక్టర్ సూచించారు. ఈ నెల 26న 'వరుడు" ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. కానీ విశ్రాంతంటూ ఇంటి పట్టున కూర్చుంటే సినిమా విడుదలకు ఆటంకం కలుగుతుందన్న భావనతో అల్లు అర్జున్ ఓ నాలుగు రోజులు రెస్ట్ తీసుకుని ఈ నెల 5 నుంచి షూటింగ్ లో పాల్గొనాలని అనుకుంటున్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu