»   » రుద్రమదేవి కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా (అల్లు అర్జున్ ఇంటర్వ్యూ)

రుద్రమదేవి కోసం తెలంగాణ యాస నేర్చుకున్నా (అల్లు అర్జున్ ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అనుష్క ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రుద్రమదేవి'. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన రుద్రమదేవి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో రుద్రమదేవి తర్వాత అత్యంత కీలకమైన పాత్ర ‘గోన గన్నారెడ్డి' పాత్ర. ప్రముఖ నటుడు అల్లు అర్జున్ పాత్రను చేయడం మరో విశేషం. అక్టోబర్ 9న రుద్రమదేవి విడుదలవుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను పంచుకున్నారు.

ఒక స్టార్ హీరో అయి ఉండి ఈ సినిమా చేయడానికి కారణాన్ని అల్లు అర్జున్ వివరిస్తూ.... మన చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తూ తెరకెక్కిస్తున్న గొప్ప సినిమా ఇది. షూటింగ్ మొత్తం పూర్తయి కేవలం గోనగన్నారెడ్డి పాత్రకు సరైన నటుడు దొరకక ఆగిపోయి ఇబ్బందుల్లో పడింది. అలాంటి గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు నా వంతు తోడ్పాటునందించాలన్న తపనతో ఈ సినిమా చేశాను అన్నారు.


ఈ సినిమాలో గోన గన్నారెడ్డి పాత్ర పాత్ర కోసం నటుడిని వెతుకుతున్నారని తెలిసి నేను స్వయంగా గుణశేఖర్ గారిని ఆ పాత్ర చేస్తాను అని అడిగాను. కమర్షియల్ అంశాల గురించి ఆలోచించ లేదు. ఈ సినిమా కోసం ఏం చేసినా మంచి జరుగుతుందనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్లాను అన్నారు. మంచి సినిమా తీస్తున్నారు కాబట్టి పారితోషికం గురించి ఆలోచించకండి, డబ్బును పక్కనబెట్టి ఈ సినిమాను పూర్తి చేయండి అని గుణశేఖర్‌తో చెప్పాను.


స్లైడ్ షోలో అల్లు అర్జున్ ఇంటర్వ్యూకు సంబంధించిన మరిన్ని విశేషాలు...


ఎంచుకున్న దారి కొత్తది

ఎంచుకున్న దారి కొత్తది

రుద్రమదేవి కోసం నేను ఎంచుకున్న దారి కొత్తది. ఎందుకంటే ఇది గొప్ప సినిమా. హీరోగా నా ఇమేజ్ గురించి ఆలోచించలేదు అన్నారు అల్లు అర్జున్


నాకోసం మార్పులు చేసారు

నాకోసం మార్పులు చేసారు

గోన గన్నారెడ్డి పాత్ర నేను చేస్తానని ఒప్పుకున్నాక నా కోరిక మేరకు గునశేఖర్ పాత్రలో కొన్ని మార్పులు చేసారు అని అల్లు అర్జున్ తెలిపారు.


గుణకు సహాయంగా ఉండాలనుకున్నా

గుణకు సహాయంగా ఉండాలనుకున్నా

మన సంస్కృతి, చరిత్రను గురించి చెప్పే గొప్ప సినిమాను గుణశేఖర్ ఒక్కరే ధైర్యంగా భుజానెత్తుకున్నారు. ఆయనకు సహాయం చేయడానికి మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ పనిని నేను ఎందుకు చేయకూడదనే ఆలోచన వచ్చింది అన్నారు.


నెల రోజులు త్యాగం చేసా అంతే

నెల రోజులు త్యాగం చేసా అంతే

రుద్రమదేవి లాంటి మంచి సినిమా కోసం ఓ నెల రోజుల సమయం త్యాగం చేస్తే సరిపోతుంది కదా అనిపించింది. ఆ ఆలోచనను ఆచరణలో పెట్టాను. కొన్ని గొప్ప విషయాలు చేయాలంటే డబ్బు గురించి ఆలోచించకూడదు అని నిర్ణయించుకొని గోన గన్నారెడ్డి పాత్ర చేశాను.


ఎలాంటి టెన్షన లేదు

ఎలాంటి టెన్షన లేదు

తెలుగు సినిమాకు ఇదొక సరికొత్త జోనర్. ఇలాంటి కథాంశంతో సినిమా తెరకెక్కడం టాలీవుడ్‌లో ఇదే తొలిసారి. ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అన్న ఉత్సుకత మాత్రం ఉంది. అంతేతప్ప సినిమా ఫలితంపై ఏ విధమైన టెన్షన్ పడటం లేదు.


కసిగా నటించాను

కసిగా నటించాను

ఇతను ఈ పాత్రకు సరిపోడు అనే స్థాయినుంచి నేను తప్ప ఈ పాత్రకు ఎవరూ న్యాయం చేయలేరు అనే స్థాయిలో నటించాలనే కసి నాలో మొదలైంది. గోన గన్నారెడ్డి పాత్రకు నేను పూర్తి స్థాయిలో న్యాయం చేశానని అనుకుంటున్నాను అన్నారు.


గోన గన్నారెడ్డి గురించి...

గోన గన్నారెడ్డి గురించి...

గోనగన్నారెడ్డి అనే పేరు తప్ప ఆ పాత్రకు సంబంధించి రిఫరెన్స్ పిక్చర్స్, ప్రామాణిక ఆధారాలు ఎక్కడా లేవు. గోనగన్నారెడ్డి 13 శతాబ్దానికి చెందినవాడు. గోన గన్నారెడ్డి ఒక దొంగ, రాబిన్‌హూడ్ లాంటి పాత్ర కాబట్టి నల్లటి వస్ర్తధారణతో సినిమాలో చూపించాలని అనుకున్నాం. మొరటుతనం ఎక్కువగా ఉండే పాత్ర కాబట్టి చిరిగిపోయిన బట్టలతో రఫ్‌గా చూపించాం. తిరుగుబాటు తత్వం ఎక్కువగా ఉండే పాత్ర షార్ట్ హేయిర్‌తో కనిపిస్తుంది. గుణశేఖర్‌తో పాటు నా ఊహలకు అనుగుణంగా గోనగన్నారెడ్డి పాత్రను సృష్టించాం అన్నారు.


తెలంగాణ యాస

తెలంగాణ యాస

గోన గన్నారెడ్డి తెలంగాణ మనిషి, మహబాబూనగర్ జిల్లా వాసి అని తెలిసింది. తెలంగాణ వ్యక్తి కాబట్టి తెలంగాణ మాట్లాడితే బాగుంటుంది అనిపించింది. కానీ ఇది అన్ని ప్రాంతాలకు సంబంధించిన సినిమా, అలాంటప్పుడు తెలంగాణ యాస అందరికీ అర్థమవుతుందా? అనే సందేహం కలిగింది. అయితే సినిమాలోని మిగతా పాత్రలన్నీ గ్రాంథికంలో మాట్లాడుతాయి కాబట్టి ఈ పాత్రకు తెలంగాణ భాష ఉపయోగిస్తే సినిమాలో ప్రత్యేకత ఉంటుందని అనిపించింది. తెలంగాణ యాసలో పాత్రకు సంబంధించిన సంభాషణలు సిద్ధం చేశాం. చాలా అందంగా వచ్చాయి.


స్వచ్ఛమైన తెలంగాణ భాషను వాడాం

స్వచ్ఛమైన తెలంగాణ భాషను వాడాం

తెలంగాణ శైలిని సినిమాలో ప్రారంభం నుంచి ముగింపు వరకు ఉపయోగిస్తూ రానున్న తొలి చిత్రమిది. స్వచ్ఛమైన తెలంగాణ భాషను వాడటం జరిగింది. తెలంగాణ యాసపై పరిజ్ఞానం నాకు తక్కువ కాబట్టి కొంత కసరత్తు చేయాల్సివచ్చింది. ఈ విషయంలో చేవేళ్ల రవి, జబర్ధ్దస్త్ వేణుతో పాటు సంభాషణల రచయిత రాజసింహా, డబ్బింగ్ ఆర్టిస్ట్ పప్పు నాకు సహకరించారు.


నా అదృష్టం

నా అదృష్టం

ఎన్టీఆర్‌కు కృష్ణుడు, కృష్ణకు అల్లూరి సీతారామారాజు, కృష్ణంరాజు పోషించిన తాండ్రపాపారాయుడు పాత్రలు చరిత్రలో నిలిచిపోయాయి. అలాగే గోన గన్నారెడ్డి ఆ స్థాయిలో గుర్తింపును తెచ్చుకుంటుందనే నమ్మకముంది. తొలిసారి ఈ పాత్రను పోషించే అదృష్టం నాకు దక్కడం ఆనందంగా ఉంది.


బాహుబలితో పోల్చొద్దు

బాహుబలితో పోల్చొద్దు

బాహుబలి జానపద కథాంశంతో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం. ఓ చారిత్రక వీరనారి జీవితగాథ ఆధారంగా రూపొందించిన చిత్రం రుద్రమదేవి. కథాంశాల పరంగా రెండు సినిమాల మధ్య చాలా వైరుధ్యాలు కనిపిస్తాయి. కాబట్టి రెండింటిని పోల్చి చూడటం అనవసరమని అనుకుంటున్నాను.


English summary
Check out Allu Arjun interview about Rudramadevi movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu