»   » అల్లు అర్జున్ కేవలం ముగ్గురినే ఫాలో అవుతున్నాడు

అల్లు అర్జున్ కేవలం ముగ్గురినే ఫాలో అవుతున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రీసెంట్ గా ట్విట్టర్ లో చేరిన అల్లు అర్జున్... కేవలం ముగ్గురునే ఫాలో అవుతున్నారు. వాళ్లు మరెవరో కాదు..పవన్ కళ్యాణ్,రానా దగ్గుపాటి, తన సోదరుడు అల్లు శిరీష్ ని. ట్విట్టర్ లో చేరిన రెండో రోజు... 16 మంది సెలబ్రెటీలను ఫాలో అయ్యాడు కానీ ఎందుకనో వారిని అన్ ఫాలో చేసాడు. ఇక పవన్ కళ్యాణ్ ఇప్పటికీ ఎవరినీ ఫాలో అవటం లేదు. మహేష్ బాబు తన బావ ఒక్కరినే ఫాలో అవుతన్నారనే విషయం తెలిసిందే.

'ముసలాళ్లమైపోతన్నామయ్యా బాబు...' అంటూ అల్లు అర్జున్ ఫన్ చేస్తూ ట్విట్టర్ లోకి వచ్చేసారు. మాట ఇచ్చినట్లుగానే ఈ రోజు అల్లు అర్జున్ ..ట్వీట్ చేసి అందరినీ అలరించాడు. అంతేకాదు ట్వీట్ తో పాటు ఓ వీడియోని ఏమేం ట్వీట్ చేయబోతున్నాడో చెప్తూ ఇచ్చాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలలో బిజీగా ఉండటం ఇప్పుడు స్టార్స్ స్టేటస్ సింబల్ గా మారిపోయింది. అందుకే సార్ట్స్ కూడా కొంచెం ముందూ వెనకా అయినా ఇటువైపు అడుగులు వేయక తప్పడం లేదు. ఇప్పటికే ఎంతో మంది సినిమా స్టార్స్.. ఫేస్ బుక్, ట్వీట్టర్స్ అకౌంట్ ఓపెన్ చేసి.. ఫ్యాన్స్ కి అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ షార్ట్ కట్ ఇంటరాక్షన్ తో కొన్ని సమస్యలు రావడంతో.. కొంతమంది వెంటనే తమ సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్స్ ను క్లోజ్ చేశారు.

Allu Arjun is following just three persons

ఇదిలా ఉంటే.. ఫేస్ బుక్ లో చాలా యాక్టివ్ గా ఉంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా విడుదలకు ఒకరోజు ముందు అంటే ఈ రోజు ఉదయం 8 గంటలకు ట్విట్టర్ లోకి కాలుమోపి.. అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ఇప్పటికే దక్షిణాదిన ఫేస్ బుక్ లో 70 లక్షల మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ తో ముందు వరుసలో ఉన్న అల్లు అర్జున్.. ట్విట్టర్ లో ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తాడో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్నారు. బన్నీ ట్విట్టర్ ఎంట్రీ టైం సమీపిస్తుండటంతో.. సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో మరో కొత్త చర్చ ఊపందుకుంటోంది.

అల్లు అర్జున్ ట్విట్టర్ ఖాతా తెరవక ముందే పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు అకౌంట్స్ తో పోల్చి చూస్తున్నారు సోషల్ మీడియా ఎక్స్ పర్ట్స్. 1.4 కోట్ల ఫాలోవర్స్ తో ట్విట్టర్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉన్న బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్.. వెయ్యి మంది ఇతర ట్విట్టర్ ఖాతాలను ఫాలో అవుతున్నాడు. ట్విట్టర్ లో 14 లక్షల ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రిన్స్ మహేశ్ బాబు.. తన బావ జయదేవ్ గళ్లా అకౌంట్ కు మాత్రమే ఫాలోవర్ గా ఉన్నాడు.

అదే విధంగా ట్విట్టర్ లోకి ఈ మధ్యనే అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ తన రూటే సపరేట్ అంటూ ఎవరినీ ఫాలో అవడం లేదు. అంతేకాదు ఈ మధ్య ఫాలోయింగ్ లిస్ట్ ను కూడా హిడెన్ చేశాడు పవర్ స్టార్. దీంతో ట్వీట్ చేసేందుకు రెడీగా ఉన్న అల్లు అర్జున్- మహేశ్ లాగా ఎవరో ఒకరినే ఫాలో అవుతాడా.. లేక పవన్ లా ఎవర్నీ ఫాలో అవ్వడా లేక వీరిద్దరిలా కాకుండా తన ప్రత్యేకత ఏమైనా చూపిస్తాడా అన్నది ఆసక్తికరంగా మారింది. మరి ప్రశ్నలకు సమాధానం కావాలంటే.. బన్నీ ట్విట్టర్ అకౌంట్ ను ఫాలో అవ్వాల్సిందే. మరి మీరు ఫాలో అవుతన్నారా.

English summary
Allu Arjun is now following three members on twitter. One is his uncle Pawan Kalyan, second one is his brother Allu Arjun and third one is his friend Rana Daggubati.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu