»   » మళయాళ 'కృష్ణ' లో అల్లు అర్జున్

మళయాళ 'కృష్ణ' లో అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Allu Arjun
ప్రస్తుతం బన్నీ యేమీ మళయాళ సినిమాలో నటించటే ప్రయంత్నం చేయటం లేదు.మరి ఈ విచిత్ర న్యూస్ యేంటంటే అతను నటించిన 'పరుగు' సినిమా 'కృష్ణ' పేరుతో మళయాళంలోకి డబ్బింగ్ చేస్తున్నారు. అసలు మళయాళంలో ఒక్క స్టైయిట్ సినిమా చెయ్యకపోయినా బన్నీ(అల్లు అర్జున్)కి అక్కడ భలే డిమాండి వచ్చేసింది. అతని సినిమాల కోసం అక్కడ డబ్బింగ్ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ పోటీ పడుతున్నారు. ఎందుకంటే అతని ఆర్య,బన్నీ,హ్యాపీ సినిమాలు అక్కడ భాక్సాఫీసుకు తెగ నచ్చేసాయి. వంద రోజులు పండుగలు చేసేసుకున్నాయి. దాంతో ఇప్పుడు 'పరుగు' ని డబ్బింగ్ చేస్తూంటే ట్రేడ్ లో మంచి క్రేజ్ వచ్చింది. దాంతో 'కృష్ణ' పేరుతో ఈ సినిమాను రిలీజు చేస్తున్నారు. ఇదీ అక్కడ మంచి మార్కులు వేయించుకుంటుందని ఆశిస్తున్నారు. బన్నీ డబ్బింగ్ సినిమాలు హవా ఇలాగే కొనసాగితే త్వరలో అక్కడా...ఇక్కడా కలిపి సినిమాలు ప్లాన్ చేస్తారు...

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X