»   » 'బద్రినాథ్' విడుదలైన ఇన్నిరోజులకు పెదవి విప్పిన రామ్ చరణ్..!?

'బద్రినాథ్' విడుదలైన ఇన్నిరోజులకు పెదవి విప్పిన రామ్ చరణ్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పుడు చిరంజీవి తనదైన స్టైల్లో స్టెప్పులు వేసి యావత్తు ఆంధ్రా ప్రజలను అలరించాడు. అసలు డ్యాన్సులు అంటే ఎలావుంటాయి, అసలు టాలీవుడ్ కి బ్రేక్ డ్యాన్స్ తో మొట్టమొదట అలరించినది మెగాస్టార్ చిరంజీవిగారే. అటువంటి ఫ్యామిలీ నుండి వచ్చిన రామ్ చరణ్, అల్లు అర్జున్, ణ్ లు వేసే స్టెప్పులకు ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులు మంచి మార్కులు వేస్తున్నారు. ఆర్టిస్టుకి అందం కాదు...అభినయం ముఖ్యం అని నిరూపించిన కథానాయకుడిగా అల్లు అర్జున్ ని చెప్పుకోవచ్చు. ఎందుకంటే, అతనేమీ అందగాడు కాదు, పెద్ద పర్శనాలిటీ వున్నా వాడు అంతకన్నా కాదు... అయితే, ఆర్టిస్టు అవడానికి కావలసిన అభినయం పుష్కలంగా వుంది. దానికి తోడు తను మంచి డ్యాన్సర్. ఎటువంటి స్టెప్స్ నైనా అవలీలగా వేసేస్తాడు. అందుకే, రెండు మూడు చిత్రాలతోనే స్టార్ ఇమేజ్ తెచ్చేసుకున్నాడు.

వివి వినాయక్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ నటించిన 'బద్రీనాథ్' సినిమా రిలీజ్ అయి ఇన్నాళ్ళయినా, ఆ సినిమా కలక్షన్లు ఇరగదీసేస్తున్నాయంటూ గీతా ఆర్ట్స్ సంస్థ ఇంచుమించు ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెడుతున్నా స్పందించని మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ... తాజాగా నోరు విప్పాడు. సినిమా బాగోగుల గురించి ఏమీ కామెంట్ చేయకుండానే, బన్నీ డ్యాన్సులని మాత్రం పొగిడేశాడు. 'అసలు బన్నీ బద్రీనాథ్ లో ఆ డ్యాన్సులేలా చేశాడో నాకర్ధంకావడం లేదు. అసలు ఇండియా మొత్తానికే బన్నీ బెస్ట్ డ్యాన్సర్. ఇంతకు ముందే నేను చెప్పినట్టుగా, పోటీ అనేది మా ఫ్యామిలీలో మా మధ్యే వుంది' అంటూ ట్విట్టెర్ లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశాడు చరణ్. డ్యాన్సులు సరే, ఇంతకీ, సినిమా ఎలా వుందో చెప్పు బాసూ? అంటున్నారు అభిమానులు.

English summary
Ram Charan is still in awe of Allu Arjun’s dances in Badrinath. He strongly believes that Bunny is the best dancer in India now. He says that he has a competitor in their family itself. Charan always speaks high about Arjun.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu