»   » అల్లు అర్జున్ ది ప్రేమ వివాహం కాదని ‘వరుడు’ ఆడియో సమక్షంలో నిర్ధారణ!

అల్లు అర్జున్ ది ప్రేమ వివాహం కాదని ‘వరుడు’ ఆడియో సమక్షంలో నిర్ధారణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

వరుడు ఆడియో విడుదల సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ: ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా వుంది. ఒక్కమాటలో చెప్సాలంటే ఈసినిమా వందశాతం గుణశేఖర్ గారి సినిమా ఆయన ఈ సినిమాకి ఆత్మ గుణశేఖర్ గారు. మేమందరం ఆయన చెప్పినట్లు నడిచే పాత్రలం మాత్రమే. మమ్మలందర్నీ ఒక చోటికి చేర్చి నడిపించారాయన. గుణశేఖర్ గారు మొదట కథ ఒక లైన్ చెప్పగానే నేను ఓకె చెప్పేశాను. అది ఒక మ్యాజిక్ అనే చెప్పాలి. ఈ సినమాలో పాటలలకు మంచి సాహిత్యాన్నందించిన వేటూరిగారికి కృతజ్ఝతలు. మణిశర్మ సంగీతం గురించి నేను కొత్తగా చెప్పవలసింది ఏమి లేదు. అంత మంచి సంగీతాన్ని అందిచారు. అలాగే ఈ చిత్రంలో నటించిన సంగీతం శ్రీనివాసరావుగారికి సుహాసిని గారికి, తను తమిళంలో ఒక హీరో అయివుండి కూడా ఎటువంటి భేషజం లేకుండా ఈ సినిమాలో సహజంగా పాత్రౌచిత్యం మేరకు నటించిన ఆర్యగారికి ప్రత్యేక కృతజ్ఝతలు చెప్పుకోవాలి. ఇక మాతో పాటు 50 రోజుల పాటు సకుటుంబ సపరివార సమేతంగా ఈ పెళ్ళి వేడుకలో పాల్గొన్న వారికి ప్రత్యేక కృతజ్ఝతలు తెలుపుకొంటున్నానన్నారు.

ఇక పోతే ఈ సభకు హాజరైన వారందరూ 'వరుడు" ఎప్పుడవుతావని అడుగుతున్నారు. లవ్ మేరేజ్ అని అనుకుంటున్నారు. కానీ నాది అరేంజ్డ్ మేరేజే. మొన్నీమద్యే మానాన్న గారు, అమ్మ నన్ను పిలిచి కూర్చోబెట్టుకొని నీ మనసులో ఎరరైనా వున్నారా? అని అడిగారు. లేదు నాన్నా నేను చూడటానికి ఇలా కనిపిస్తాను...మీకు ఎవరు నచ్చితే వారినే చేసుకుంటానని చెప్పాను. కాబట్టి నేను 'వరుడు" ఎప్పుడవుతానో అల్లు అరవింద్ గార్నే అడగండి" అన్నారు చిరునవ్వులు చిందిస్తూ....

అందుకు సమాదానంగా అల్లు అరవింద్ గారు ఈ సినిమాకి పెళ్ళి పెద్ద గుణశేఖర్. ఈ వేడుకకి పెళ్ళికొడుకు మణిశర్మ. దానయ్యగారి నిర్మాణ విలువలు తెలిసినవే. వేటూరి సుందరామ్మూర్తిగారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. ప్రతి సంవత్సరం బన్నీ పుట్టినరోజుకి నీకేం కావాలి అని అడిగి గిఫ్ట్ ఇస్తుంటాను. ప్రతిసారి కోటి రూపాయల కారో ఏదో ఒకటి అడుగుతుంటాడు. రెండేళ్ళ క్రితం అనుకుంటాను డాడీ గుణశేఖర్ తో సినిమా చెయ్యాలి, తెచ్చివ్వు అన్నాడు. ఈ సినిమాతో ఆ గిఫ్ట్ ఇచ్చినట్టేనని అనుకుంటున్నాను. బన్నీని ఈ డ్రెస్ లో చూసి చాలా ఆనందపడ్డాను బన్నీ ఇంతకుముందు మామధ్య జరిగిన సంభాషణ కొంతే చెప్పాడు. మిగిలింది నేను చెబుతాను, 'మొన్నీమధ్య ఒక రోజు వాళ్ళ అమ్మానేను బన్నీని పిలిచి మా మధ్య కూర్చోబెట్టుకొని నీకు 25 సంవత్సారాలు దాటుతున్నాయి నీ మనస్సులో ఎవరైనా వుంటే చెప్పు. మాకెలాంటి అభ్యంతరం లేదు. పెళ్ళి చేస్తామని అడిగాము. వాడు కాసేపు ఆలోచించి నాకలాంటివేమీ లేవు. అమ్మాయిని మీరు చూడండి..చేసుకుంటాను అన్నాడు సింపుల్ గా. అయినా నా సందేహం తీరలేదు. తర్వాత ఏదైనా చెప్పడానికి ముందు ఇది సంకేతమా అని అనుమాన పడ్డాను. మళ్ళీ అడిగాను. లేదు డాడీ మీరు చెప్పిన అమ్మాయినే పెళ్ళి చేసుకుంటాను. నాకు అరేంజ్డ్ మ్యారేజ్ అంటేనే ఇష్టం. అలా చేసుకోవాలని ఎప్పుటి నుండో నిర్ణయించుకున్నాను అన్నాడు. సరే ఎలాంటి అమ్మా కావాలో చెప్పు అన్నాను. షి హ్యాజ్ టు బి వెరీ బ్యూటిఫుల్. నేను సినిమా యాక్టర్ని డాడి. నా భార్య చాలా అందంగా వుండాలి అన్నాడు. అందం సరే ఇంకా ఏం కావాలి అన్నాను. మనమందరం కలిసిమెలిసి వుంటున్నాం. వచ్చే అమ్మాయి కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చేది అయితే బాగుంటుంది. లేకపోతే కుటుంబం చిన్నాభిన్నమైపోతుంది. కాబట్టి కుటుంబ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా వుండే అమ్మాయిని చూడమన్నాడు. వెంటనే వాళ్ళ అమ్మ బన్నీని కౌగలించుకొని ఏడ్చేసింది. ఇంత మోడరన్ గా వున్నా బన్నీ కుటుంబ విలువలకు ప్రాధాన్యతనిస్తాడు. బహుశా దానికి అద్దం పట్టేదేనేమో ఈ సినిమా" అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu