»   » ఏం జరిగింది? అల్లు అర్జున్ సినిమా ఆగిపోయిందా?? విభేదాల వల్లనే అంటూ గుసగుసలు

ఏం జరిగింది? అల్లు అర్జున్ సినిమా ఆగిపోయిందా?? విభేదాల వల్లనే అంటూ గుసగుసలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం డీజే (దువ్వాడ జగన్నాథమ్‌). హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది. ఈ నెల 18న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తవగానే వెంటనే మరో సినిమాను పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు బన్నీ,

డీజేను పూర్తి చేసేస్తున్న అల్లు అర్జున్ ఇప్పటికే లింగు స్వామి దర్శకత్వంలో తెలుగు-తమిళ్ బైలింగ్యువల్ అనౌన్స్ అయిపోయింది. డీజే పూర్తి కాగానే లింగుస్వామితో సినిమా స్టార్ట్ చేయనున్న బన్నీ.. దాంతో పాటే వక్కంతం వంశీ సినిమా 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'ను కూడా చేయబోతున్నాడనే విషయం తెలిసిందే.

 Allu Arjun, Linguswamy New Project dropped off?

అయితే.. లింగుస్వామి ప్రాజెక్టు విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తాయట. ఈ ప్రాజెక్టును ఇప్పుడు రద్దు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. బన్నీ వైపు నుంచి ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తేడాలు లేకపోయినా.. దర్శకుడు-నిర్మాతల మధ్య కొన్ని విబేధాలు తలెత్తాయట. అటు ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ.. ఇటు షేరింగ్ విషయంలోనూ కొన్ని పొరపొచ్చాలు తలెత్తాయని తెలుస్తోంది. వీటిని పరిష్కరించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని అంటున్నారు.

అయితే.. ఈ ప్రాజెక్టును హోల్డ్ లో ఉంచారా.. లేక పూర్తిగా రద్దు చేసుకున్నారా అనే విషయం మాత్రం తేలలేదు. ఈ బైలింగ్యువల్ షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు లేకపోవడంతోనే తన పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 8నుంచి 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాడట స్టైలిష్ స్టార్. సో ఇప్పుడు డీజే తర్వాత స్ట్రైట్ గా నాపేరు సూర్యా... మూవీ నే మొదలుపెట్టేస్తాడన్నమాట. ఇండస్ట్రీలో ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు మామూలే కాబట్టి, లింగుస్వామి సినిమా కూడా తర్వాత ఉండొచ్చనుకునేవాళ్ళూ ఉన్నారు. మొత్తానికే ఈ ప్రాజెక్ట్ అటక ఎక్కించరు గానీ సరైన సమయం లో సరైన హీరో తో గనక కుదరక పోతే కొన్ని సార్లు తర్వాత తీసినా డిజాస్టర్ అయ్యిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

English summary
Allu Arjun, Linguswamy New Project planned as bilingual - Tamil and Telugu, Not clear whether this film has entirely been dropped off or put on hold temporarily.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu