»   » బన్నీని సరికొత్తగా చూపించనున్న జూ ఎన్టీఆర్ 'శక్తి' డైరెక్టర్..!?

బన్నీని సరికొత్తగా చూపించనున్న జూ ఎన్టీఆర్ 'శక్తి' డైరెక్టర్..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం 'బద్రీనాథ్' సినిమాను పూర్తి చేస్తున్న కొత్త పెళ్ళికొడుకు అల్లు అర్జున్, తన తదుపరి చిత్రాల ప్లానింగ్ ను చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేయడానికి ఇటీవలే అంగీకరించిన బన్నీ, తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మెహర్ 'శక్తి' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో వున్నాడు.

హీరోలను ఓ కొత్త స్టయిల్ లో చూపిస్తాడనే పేరు సంపాదించుకున్న మెహర్ కూడా బన్నీతో చేయడానికి ఆసక్తి చూపుతున్నాడు. ఇప్పుడీ కాంబినేషన్ ను ఓ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ తెర మీదకు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి. ఏమైనా, వీరిద్దరి కలయికలో ఓ భారీ చిత్రం మాత్రం రానుంది!.

English summary
A reputed production house is now planning movie with Allu Arjun under the director of Mehar Ramesh. Allu Arjun is currently shooting for the film ‘Badrinath’ in the direction of VV Vinayak. Likewise, Meher Ramesh is currently working on the mega venture ‘Shakti’ with Junior NTR. C Ashwini Dutt is producing this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu