»   » దువ్వాడ జగన్నాథం ట్రైలర్ కిర్రాక్.. అదరగొట్టిన అల్లు అర్జున్

దువ్వాడ జగన్నాథం ట్రైలర్ కిర్రాక్.. అదరగొట్టిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారీ అంచనాలు నెలకొన్న దువ్వాడ జగన్నాథం చిత్రానికి సంబంధించి టీజర్ సోమవారం రాత్రి 7.30 గంటలకు రిలీజ్ అయింది. ఈ చిత్రంలోని ఓ పాటను బ్రాహ్మాణ సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో వివాదం రాజుకొన్నది. ఈ వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే చిత్ర నిర్మాత టీజర్‌ను రిలీజ్ చేశారు. ఆ పాటకు రికార్డు స్థాయిలో డిజ్‌లైక్స్ వచ్చిన సంగతి తెలిసిందే.


మామూలు లవ్వు కాదు..

మామూలు లవ్వు కాదు..

పైగా నాది మామూలు లవ్వా. లవ్వా లవ్యాస్య లవ్వోహ్య అంటూ అల్లు అర్జున్ రొమాంటిక్‌గా చెప్పిన అల్లు అర్జున్ డైలాగ్స్ యూత్‌ను ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి.


వాయించే డీజేని

వాయించే డీజేని

మనం చేసే పనిలో మంచి కనిపించాలి. కాని మనిషి కనిపించకూడదు. పబ్బుల్లో వాయించే డీజే కాదు.. పగిలిపోయేలా వాయించే డీజేని చెప్పిన డైలాగ్స్ అదరగొట్టాయి.


యుద్ధం శరణం గచ్ఛామి

యుద్ధం శరణం గచ్ఛామి

ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి అనాల్సింది కాదు సార్. యుద్ధం శరణం గచ్చామి అనాలి అంటూ షాక్ ఇచ్చారు. టీజర్‌లో యాక్షన్, రొమాంటిక్ సీన్లు చూస్తే పక్కా కమర్షియల్ హంగులు ఉన్నాయని అనిపిస్తున్నది.


నేను చంపకపోతే ..

నేను చంపకపోతే ..

సత్యనారాయణపురం అగ్రహారం సాక్షిగా చెప్తున్నాను. వాడిని చూసిన రోజే చంపేస్తాను. అలా చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు.. శ్రీవాస్తవ గోత్రంలోనే పుట్టలేదు. జూన్ 23న వస్తున్నాను అంటూ హెచ్చరిక చేసిన తీరు అభిమానుల్లో జోష్ నింపేలా ఉంది.English summary
DJ Teaser released on Monday 7.30pm as per announcement by hero Allu Arjun. Allu Arjun mesmerised in teaser. Sure this teaser hit the roost.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X