twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నన్ను చూసి అతను మారాడు.. ఆ అలవాటు మానుకొన్నాడు.. అల్లు అర్జున్

    మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దని వాహనదారులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూచించాడు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సుకు సంచలన దర్శకుడు రాజమౌళితో కలిసి ఆయన హాజరయ్యారు.

    By Rajababu
    |

    మద్యం మత్తులో వాహనాలు నడుపవద్దని వాహనదారులకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సూచించాడు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ట్రాఫిక్ అవగాహన సదస్సుకు సంచలన దర్శకుడు రాజమౌళితో కలిసి ఆయన హాజరయ్యారు. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో అవగాహన సదస్సులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, ట్రాఫిక్ డీసీపీ రంగనాథ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్, రాజమౌళి మాట్లాడారు.

    నా డ్రైవర్ కూడా మారాడు.

    నా డ్రైవర్ కూడా మారాడు.

    మద్యం సేవించి తాను వాహనం నడుపనని, నన్ను చూసి డ్రైవర్ కూడా ప్రవర్తనను మార్చుకొన్నాడు అని అల్లు అర్జున్ తెలిపాడు. రూల్స్ బ్రేక్ చేయడం అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదని, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దామన్నారు. పరిసరాల పరిశుభ్రత, ట్రాఫిక్ తీరు చూసి మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చని ఆయన అన్నారు.

    మద్యం మత్తులో వాహనం నడుపొద్దు

    మద్యం మత్తులో వాహనం నడుపొద్దు

    మందు తాగండి.. కానీ ఆ మత్తులో వాహనాలను నడపవద్దు. నీ కారణాలు.. తప్పు ముందు నిలబడవు. రూల్స్ కఠినంగా ఉన్నా.. ఇంకా మార్పు రావాలి. చాదస్తం అనుకున్నా సరే.. అవతలి వారి ప్రాణాలతో ఆడుకోవద్దు' అని తెలిపారు.

    ఎంజాయ్ చేయండి.. కానీ

    ఎంజాయ్ చేయండి.. కానీ

    ఎంజాయ్ చేయండి.. కానీ.. ‘మందు తాగిన వాళ్లు.. తాగని వాళ్లతో తమ వాహనాలను నడిపించుకోవాలి. డ్రింక్ చేయవద్దని నేను చెప్పను. కానీ, డ్రింక్ చేసిన వారు వాహనాలను నడపవద్దని చెప్తాను. నేటి యువతరం నిబంధనలకు కట్టుబడి ఉన్నారని నేను నమ్ముతాను. ఎంజాయ్ చేయండి.. కానీ, ప్రమాదాలకు కారణం కావొద్దు అని అల్లు అర్జున్ స్పష్టం చేశారు.

    యువతకు స్పీడ్ అవసరం కానీ..

    యువతకు స్పీడ్ అవసరం కానీ..

    అనంతరం దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ.. యువతకు అన్ని విషయాల్లో స్పీడు అవసరం. కానీ, డ్రైవింగ్ విషయంలో మాత్రం ఆ స్పీడ్ అవసరం లేదు. అతివేగానికి మన రోడ్లు అనుకూలం కాదు. దేశంలో ఉగ్రదాడుల వల్ల ఏడాదిలో సగటున 150 నుంచి 200మంది వరకు చనిపోతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

    రోడ్డు ప్రమాదాల గురించి మీడియా..

    కానీ ఉగ్రదాడుల కంటే రోడ్డు ప్రమాదాల్లో లక్షా 40వేల మంది చనిపోతున్నారు. ఈ విషయాన్ని మనం అసలే పట్టించుకోం. మీడియా కూడా ఇలాంటి వార్తలను చూసి చూడనట్టు వదిలేస్తుంది. మనం చేసే చిన్న చిన్న తప్పుల మూలంగా భారీ మూల్యం చెల్లించుకుంటున్నాం' అని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రవ్ చేయవద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి మన దేశానికి మనమే శత్రువులుగా మారకూడదని అన్నారు.

    English summary
    Stylish Star Allu Arjun, Director SS Rajamouli attende for Traffic meeting which conduct in Hyderabad. In this meeting, Allu Arjun said that dont drink and drive. Drunk and drive is dangerous.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X