»   » “నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” షూటింగ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌

“నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా” షూటింగ్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్:స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, అను ఇమాన్యుయెల్ హీరోయిన్‌గా వక్కంతం వంశి ద‌ర్శ‌క‌త్వం లో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" మెద‌టి షెడ్యూల్ పూర్త‌య్యింది. రెండ‌వ షెడ్యూల్‌ని ఈ నెల 18 నుండి స‌సెప్టెంబ‌ర్ 2 వరకూ జ‌రుపుకుంటుంది.

ఈ షెడ్యూల్ లో

ఈ షెడ్యూల్ లో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పాల్గంటారు. యాక్షన్ కింగ్ అర్జున్ ముఖ్య పాత్రలో శరత్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018, ఏప్రిల్ 27 న విడుద‌ల చేయ‌టానికి సన్నాహ‌లు చేస్తున్నారు.


Allu Arjun's Next Movie Naa Peru Surya Naa Illu India Launched
ఈ సందర్భంగా

ఈ సందర్భంగా

చిత్ర నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.... .ఇటీవలే మా చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" మెద‌టి షెడ్యూల్ పూర్త‌య్యింది. నెక్ట్స్ష‌ష‌షెడ్యూల్ లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు జాయిన్ అవుతారు. ఆయ‌న‌ మా బ్యాన‌ర్ లో న‌టిస్తున్నందుకు చాలా ఆనందంగా వుంది. ఈ షెడ్యూల్ ని అగ‌ష్టు 18నుండి సెప్టెంబ‌ర్ 2 వ‌ర‌కూ జ‌రుగుతుంది" అన్నారు.


అను ఇమ్యున‌ల్

అను ఇమ్యున‌ల్

"బ‌న్ని ఎన‌ర్జి కి త‌గ్గ‌ట్టుగా చేసిన‌ ఈ క‌థ లో అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాలు వుంటాయి. అను ఇమ్యున‌ల్ హీరోయిన్ గా చేస్తుంది. సూపర్ హిట్ చిత్రాలకు కథ అందించి వరస సక్సెస్ లు అందుకొని తొలిసారిగా మెగా ఫోన్ ప‌ట్టిన వక్కంతం వంశీ వర్క్ చాలా ఎన‌ర్జిగా చేస్తున్నాడు. నాగబాబు, బన్నీవాసు గారి ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ ముందుకెళ్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇండియా గర్వించదగ్గ నటీనటులు, టెక్నీషియన్స్ టీంతో గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. విశాల్ శేఖర్ సూపర్ మ్యూజిక్ అందిస్తున్నారు. 2018 ఏప్రిల్ 27న ఈ చిత్రాన్ని విడ‌దుల చేస్తున్నాం" అని చెప్పారు.


నటీనటులు

నటీనటులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్,అను ఇమాన్యుయెల్ , యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులుసాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు

బ్యానర్ - రామలక్ష్మీ సినీ క్రియేషన్స్
సమర్పణ - కె.నాగబాబు
సహ నిర్మాత - బన్నీ వాసు
నిర్మాత - శిరీషా శ్రీధర్ లగడపాటి
రచన, దర్శకత్వం - వక్కంతం వంశీ


English summary
Stylish star Allu Arjun will participate in the second schedule of Naa Peru Surya - Naa illu India shooting.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu