»   » అల్లు అర్జున్ రికార్డుని మిగతావాళ్లు బ్రద్దలు కొట్టడం కష్టం

అల్లు అర్జున్ రికార్డుని మిగతావాళ్లు బ్రద్దలు కొట్టడం కష్టం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ మంచి ఊపు మీద ఉన్నారు. రేసు గుర్రం ఊహించని విధంగా ఘన విజయం సాధించి, రికార్డు కలెక్షన్స్ తో ముందుకు వెళ్తోంది. ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ మరో రికార్డుని కూడా క్రియేట్ చేసి, తన తోటి హీరోలకు ఛాలెంజ్ వదిలారు. తెలుగులో స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, పవన్, మహేష్ బాబులను వెనక్కి తోయగలిగారు. ఇంతకీ ఏమిటా రికార్డు అంటే ...ఫేస్ బుక్ లో ఆయన పేజీకి వచ్చే లైక్ ల విషయంలో. నలభై లక్షల పై చిలుకు లైక్ లతో ఆయన ఫేస్ బుక్ పేజీ వెలిగిపోతోంది. ఇప్పట్లో ఆయన రికార్డుని ఏ ఇతర తెలుగు హీరో బ్రద్దలు కొట్టే వాతావరణం కనపడటం లేదు.

Allu Arjun, No.1 Hero of FaceBook in South India!

సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో తమకో పేజీ క్రియేట్ చేయటం హీరోలు సర్వ సాధారణంగా చేస్తూంటారు. అయితే ఆ పేజీకి ఎంత ఆదరణ ఉంది అనేది అక్కడ పెట్టే హీరో కి చెందిన లేటెస్ట్ అప్ డేట్స్ పై ఆధారపడి ఉంటుంది. పేజీ క్రియేట్ చేయటంతో చాలా మంది హీరోలు సరిపెట్టుకుంటున్నారు. అయితే అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికప్పుడు తనకు చెందిన అప్ డేట్స్ మొత్తం ఫేస్ బుక్ లోని తన అఫీషియల్ పేజీ ద్వారా ఫ్యాన్స్ కు తెలియచేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ పేజీ ఎప్పుడూ లైవ్ గా ఉంటోంది. లైవ్ గా ఉండటంతో అందరూ ఆ పేజీకి కనెక్టు అవుతున్నారు. ఇప్పుడా పేజీ నలభై లక్షల లైక్స్ తో ముందుకు దూసుకువెళ్లి రికార్డ్ క్రియేట్ చేస్తోంది. ఏ తెలుగు హీరో కూడా ఈ విషయంలో అల్లు అర్జున్ ని బీటే చేయలేని విధంగా ముందుకు దూసుకువెళ్తోందీ పేజి.

ఇక అల్లు అర్జున్ తాజా చిత్రం "రేసు గుర్రం" టైటిల్ కి తగ్గట్లే భాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ముఖ్యంగా నైజాంలో ఇది రికార్డులు క్రియేట్ చేస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ లో తొలిసారి నైజాంలో 10 కోట్లు గ్రాస్ కలెక్టు చేసిన చిత్రంగా చెప్తున్నారు. ఇన్నాళ్లూ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటివారికే అక్కడ గ్రిప్ ఉండేది. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం ఆ లిస్ట్ లో చేరటంతో ఉత్సాహంగా ఉన్నాడు.

ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొదటి వారంలో 33 కోట్లు వరకూ కలెక్టు చేసిందని, ఇదే స్పీడులో దూసుకుపోతే యాభై కోట్లు అనేది పెద్ద విషయం కాదు అంటున్నారు. ఈ చిత్రం ఇంత విజయానికి కారణాల్లో ప్రధానమైనది మార్కెట్ లో మరో చిత్రం పోటీ లేకపోవటమే అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

English summary

 Allu Arjun is riding high on the blockbuster success of his latest offing ‘Race Gurram’, here is one more remarkable feat achieved by him. He has got 4 million fans on facebook now. Allu Arjun is the one and only South Indian hero to have achieved this feat. He surpassed all of his contemporary heroes of his generation. The number of likes are double the number of any tollywood hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu