»   » తెలంగాణ అంశంపై పెదవివిప్పిన అల్లు అర్జున్

తెలంగాణ అంశంపై పెదవివిప్పిన అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాను ఇక్కడ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగాననీ, అలాగే తమ కుటుంబ సభ్యుల చిత్రాలన్నీ తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయనీ అల్లు అర్జున్ అన్నారు. హైదరాబాద్ లోని కాలేజీ స్టూడెంట్స్ తో శుక్రవారం జరిపిన ముఖాముఖీలో తెలంగాణపై మీ అభిప్రాయం అన్నట్లుగా ఓ విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందిచారు. అలాగే రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టి చూడటం ఎంత మాత్రం సరికాదని అల్లు అర్జున్ అన్నారు. తనతో పాటు ఇక్కడుకు హాజరైన వారంతా హైదరాబాదీయులేనని అంటూ సినిమాల ప్రస్తావన వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్ర అనే తేడా ఉండదని, అందరికీ వినోదం, సినిమావారికీ అందరూ కావాలని సమాధానం చెప్పారు.ఏ విధమైన కాంట్రావర్శీ లేకుండా అల్లు అర్జున్ చెప్పిన సమాధానం చాలా మందికి నచ్చింది. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ నటించిన వరుడు చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. అలాగే క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న వేదం కూడా వైజాగ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇవి పూర్తయ్యాక వివివినాయిక్ దర్శకత్వంలో అల్లు అర్జున్ బదరీనాధ్ చిత్రాన్ని చేయనున్నారు. ఇక ఇంతకుముందు చిరంజీవి సమైఖ్యాంద్ర అన్నారని అల్లు అర్జున్ నటించిన ఆర్య 2 చిత్రాన్ని తెలంగాణ ప్రాంతాల్లో ఆడకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu