»   » ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న అల్లు అర్జున్

ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్న అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

తాను సౌత్ ఇండియన్ స్టార్ ని అయినందుకు గర్వ పడుతున్నానని అల్లు అర్జున్ అన్నారు. అలాగే..తెలుగు పరిశ్రమతో పోలిస్తే బాలీవుడ్ చాలా పెద్దదని అన్నారు. అయితే సౌత్ లోని ఆంద్రా, కర్నాటక,తమిళనాడు, కేరళ సినీ పరిశ్రమలు నాలుగూ కలిస్తే..చేసే బిజెనెస్ ని బాలీవుడ్ బ్రేక్ చేయలేదని అన్నారు. అలాగే తమ బిజెనెస్...బాలీవుడ్ భాక్సాఫీస్ కి ఓపెన్ ఛాలెంజ్ ని ఇస్తుందని అన్నారు. రీసెంట్ గా కేరళలో విడుదలైన ఆర్య 2 చిత్రం మంచి విజయం నమోదు చేస్తూండటంతో ఆ ఉత్సాహంతో మీడియాతో మాట్లాడారు. అయితే తెలుగులో ఆర్య 2 ఆశించిన ఫలితం ఇవ్వలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్...గుణశేఖర్ కాంబినేషన్ లో వస్తున్న వరుడు చిత్రం హడావిడిలో ఉన్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో చేస్తున్న వేదం చిత్రం కూడా ఫైనల్ స్టేజికి వచ్చింది. వీటి తర్వాత వివివినాయిక్ కాంబినేషన్ లో బద్రినాధ్ చిత్రం చేయటానికి కమిట్ అయ్యారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu