»   » అల్లు అర్జున్ ప్రాణం పెట్టి చేశాడు.. నా పేరు సూర్యలో పెర్ఫార్మెన్స్ హైలెట్..

అల్లు అర్జున్ ప్రాణం పెట్టి చేశాడు.. నా పేరు సూర్యలో పెర్ఫార్మెన్స్ హైలెట్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అను ఇమ్మాన్యుయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, శ‌ర‌త్ కుమార్ ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను నిర్మాతలు మీడియాతో పంచుకొన్నారు.

Allu Arjun Brutally Trolled Netizens Naa Peru Surya Dialogue
అల్లు అర్జున్‌ పెర్ఫార్మెన్స్‌కు ఫిదా

అల్లు అర్జున్‌ పెర్ఫార్మెన్స్‌కు ఫిదా

ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఫ‌స్ట్ ఇంపాక్ట్‌ మ‌రియు డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయ్యారు.
ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది... ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మే 4న విడుదల కానున్నది.


13న మూడో సింగిల్

13న మూడో సింగిల్

ప్ర‌ముఖ ర‌చ‌యిత సీతారామ‌శాస్త్రి గారు రాసిన బ్యూటిఫుల్ ల‌వ్ అనే 3వ సింగిల్ ని ఏప్రిల్ 13న విడుద‌ల చేస్తున్నారు, త్వ‌ర‌లోనే మిగ‌తా సింగిల్స్ విడుద‌ల చేసి, నెలాఖ‌రున గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఫంక్ష‌న్ చేస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారు.


 గ్రాండియర్‌గా నా పేరు సూర్య

గ్రాండియర్‌గా నా పేరు సూర్య

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.... స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్, అను ఎమ్మాన్యుయేల్ జంటగా... వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా అత్యంత భారీగా, గ్రాండియర్ గా "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". చిత్రాన్ని నిర్మిస్తున్నాం. మా హీరో ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నారో ఫ‌స్ట్ ఇంపాక్ట్‌, డైలాగ్ ఇంపాక్ట్ చూసిన వారంతా చెప్తున్నారు అని అన్నారు.


ప్రాణం పెట్టి అల్లు అర్జున్

ప్రాణం పెట్టి అల్లు అర్జున్

నా పేరు సూర్య చిత్రానికి మెయిన్ బన్నీ పెర్ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. అల్లు అర్జున్ ని ఎప్పుడూ చూడ‌ని విధంగా ద‌ర్శ‌కుడు వ‌క్కంతం వంశీ ఈ చిత్రంలో చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం బ‌న్ని త‌న ప్రాణం పెట్టి చేశాడ‌నేది అక్ష‌ర‌స‌త్యం. పాత్ర‌లో ఇమిడిపోవ‌డ‌మే కాకుండా డెడికేష‌న్‌తో పనిచేస్తున్నారు.


 బ‌న్నీ ఫెర్‌ఫార్మెన్స్ గురించే..

బ‌న్నీ ఫెర్‌ఫార్మెన్స్ గురించే..

వాస్తవంగా మిల‌ట‌రి వాళ్ళు ఎలా వ‌ర్క‌వుట్ చేస్తారో తెలుసుకుని, వాళ్ళ‌ని క‌ల‌సి ఇది సినిమా అని కాకుండా పాత్ర‌లో జీవించాడు. చిత్రం చూసిన వారికి తెలుస్తుంది. మే 4న ప్రేక్ష‌కులు చెప్పె మెద‌టి మాట బ‌న్నీ ఫెర్‌ఫార్మెన్స్ గురించే..మరో వైపు విశాల్ శేఖర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన రెండు సాంగ్స్ అటు ఆన్‌లైన్ లో కాని , కాల‌ర్‌టోన్స్ గా కాని మంచి క్రేజ్ ని సొంతం చేస‌కున్నాయి అని అన్నారు.


 నటీనటులు

నటీనటులు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు
సాంకేతిక నిపుణులు
ఎడిటర్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
ఫైట్స్ - రామ్ లక్ష్మణ్
సాహిత్యం - , సీతారామ శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి
ప్రొడక్షన్ డిజైనర్ - రాజీవన్
సినిమాటోగ్రఫి - రాజీవ్ రవి
సంగీతం - విశాల్ - శేఖర్
ప్రొడక్షన్ కంట్రోలర్ - డి. యోగానంద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - బాబు


English summary
Allu Arjun turned a year older on Sunday, and as a birthday treat for his fans, the 'Stylish Star' shared a dialogue promo from his upcoming film, Naa Peru Surya. In the 40-second teaser, he schools an ignorant villain who calls him "South India ka saala". With inimitable swagger and a powerful punch squarely in the jaw, Allu Arjun tells him, "South India, North India, East, West... Anni Indialu levura manaki... Okkate India." This dialougue impact creating sensation. So producers of the movie speak to media regarding the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X