»   » ఫోటో మూమెంట్స్ : ‘రుద్రమదేవి’ లో అల్లు అర్జున్

ఫోటో మూమెంట్స్ : ‘రుద్రమదేవి’ లో అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘రుద్రమదేవి' సినిమాలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. అంతేకాదు అల్లు అర్జున్ చేయనున్న గోన గన్నారెడ్డి పాత్రకి సంబందించిన డిష్కషన్స్ గుణశేఖర్ ఆఫీసులో పాల్గొన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అనుష్క ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్‌ స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'రుద్రమదేవి'. ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి పాత్రలో అల్లు అర్జున్‌, చాళుక్య వీరభద్ర పాత్రలో రానా నటిస్తున్నారు. అల్లు అర్జున్‌ పాత్రకు సంబంధించిన కొత్త స్టిల్స్ ను చిత్ర బృందం విడుదల చేసింది. చారిత్రక కథ నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని అందిస్తున్నారు.

గుణశేఖర్ మాట్లాడుతూ -''బన్నీ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. రాబిన్‌హుడ్ తరహాలో యువతని, మాస్‌ని విశేషంగా ఆకట్టుకునేలా ఈ పాత్ర ఉంటుంది. జూలై 4 నుంచి 30 రోజుల పాటు ఈ పాత్ర చిత్రీకరణ జరిపాం. అద్భుతంగా వచ్చింది. పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో ప్రేక్షకుల్ని సంభ్రమకు లోనుచేసేలా సన్నివేశాలు పడ్డాయి. పీటర్‌హేన్స్ నేతృత్వంలో డూప్ లేకుండా బన్నీ చేసిన పోరాట సన్నివేశాలు ఆశ్చర్యానికి లోనుచేస్తాయి. అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ పోరాట దృశ్యాలను తెరకెక్కించాం. '' అన్నారు.

ఆ ఫొటో మూమెంట్స్ ని స్లైడ్ షో లో వీక్షించండి

మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన...

మహబూబ్ నగర్ జిల్లాకి చెందిన...

నాటి వర్ధమానపురం (నేటి మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డెమాన్‌) ప్రాంతానికి చెందిన గోన గన్నారెడ్డి.

బందిపోటుగా...

బందిపోటుగా...

బందిపోటు పాత్రలో అల్లు అర్జున్‌ కనిపించనున్నారు.

ఇప్పటికే..

ఇప్పటికే..

ఈ లుక్‌ని, మేకింగ్‌ వీడియోని సంక్రాంతి కానుకగా విడుదల చేసారు..అందరినుంచి మంచి ప్రసంసలు వచ్చాయి.

రాబిన్ హుడ్

రాబిన్ హుడ్

ఈ గోన గన్నారెడ్డి పాత్ర ‘రాబిన్‌ హుడ్‌' తరహాలో యువతరాన్ని, పిల్లల్ని విశేషంగా ఆకట్టుకునే రీతిలో సాగుతుంది.

హైలెట్

హైలెట్

పోరుగడ్డకి తిరుగుబాబు నేర్పిన కాకతీయ వీరఖడ్గం గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్‌ నటన చిత్రానికే హైలైట్‌గా నిలుస్తుంది.

ఫైట్స్ ప్రత్యేకం

ఫైట్స్ ప్రత్యేకం

పీటర్‌ హెయిన్స్‌ ఆధ్వర్యంలో చిత్రీకరించిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.

ప్రస్తుతం

ప్రస్తుతం

ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది.

తొలి..

తొలి..

ఈ చిత్రం భారతదేశంలోనే మొట్టమొదటి స్టీరియోస్కోపిక్‌ 3డి చిత్రంగా నిర్మించబడుతోంది.

రెండు గెటప్స్..

రెండు గెటప్స్..

ఇందులో అనుష్క రెండు విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతోంది. ఒకటి వీరనారిగా అయితే రెండోది గ్లామరస్‌ ప్రిన్సెస్‌. ఈ రెండు గెటప్‌ల కోసం కేవలం మూడు నెలల వ్యవధిలో తన బాడీ లాంగ్వేజ్‌ను మార్చుకుంది.

దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ...

దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ ...

పన్నెండేళ్ల క్రితమే 'రుద్రమదేవి' చరిత్రని సినిమాగా తీయాలన్న ఆలోచన వచ్చింది. అప్పట్లో ఆ పాత్రకు ఎవరు సరితూగుతారా? అంటూ అన్వేషించా. కొంతమందితో ఫొటో షూట్‌ కూడా నిర్వహించాం అన్నారు.

అరుంధతి చూసాకే

అరుంధతి చూసాకే

గుణశేఖర్ కంటిన్యూ చేస్తూ... ఓసారి 'అరుంధతి' సినిమా చూశా. అందులో జేజమ్మగా అనుష్కని చూసి షాక్‌ తిన్నా.

దొరికేసింది

దొరికేసింది

'నా రుద్రమదేవి దొరికేసింది' అనిపించింది. ఈ సినిమాని నేనెంత ప్రేమించానో, అంతకంటే ఎక్కువగా ప్రేమించింది అనుష్క. షూటింగ్‌ మొదలెట్టక ముందే ఎన్నో కసరత్తులు చేసింది, గుర్రపు స్వారీ నేర్చుకొంది అననారు.

రిస్క్ తీసుకుంది

రిస్క్ తీసుకుంది

'రుద్రమదేవి దిగొచ్చింది' అనుకొనేలా కష్టపడింది. పోరాట సన్నివేశాల్లో హీరోలు ఎంతో రిస్క్‌ తీసుకొంటారో, అనుష్క అంతకంటే ఎక్కువగానే తీసుకొంది. ఓ సన్నివేశంలో నూటయాభై అడుగుల ఎత్తున వేలాడుతూ నటించింది.

రెండు ఛాయల్లోనూ

రెండు ఛాయల్లోనూ

ఈ సినిమాలో ఆమె పాత్రలో రెండు ఛాయలుంటాయి. ఒకటి రాణీ రుద్రమ, మరోటి యువరాణి ఝాన్సీ. రుద్రమదేవి పాత్రలో రాజసం, ఠీవీ ఎంత ముఖ్యమో.. రాజకుమారిగా కనిపించాలంటే సున్నితత్వం, లాలిత్యం అంతే అవసరం.

బరువు తగ్గింది

బరువు తగ్గింది

రాజకుమారి పాత్ర కోసం మూడు నెలల విరామంలో బరువు తగ్గి, మళ్లీ స్లిమ్‌గా మారింది. ఆమెను రాజకుమారిగా చూసి యూనిట్‌ సభ్యులు మొత్తం ఆశ్చర్యపోయాం.

ఏయే పాత్రల్లో..

ఏయే పాత్రల్లో..

ఈ చిత్రంలో రాణీ రుద్రమగా....అనుష్క, చాళుక్య వీరభద్రునిగా.... రానా, గణపతిదేవునిగా.... కృష్ణంరాజు, శివదేవయ్యగా... ప్రకాష్‌రాజ్, హరిహరదేవునిగా.... సుమన్, మురారిదేవునిగా... ఆదిత్యమీనన్, నాగదేవునిగా.... బాబా సెహగల్, కన్నాంబికగా.... నటాలియాకౌర్, ముమ్మడమ్మగా.... ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం జరాషా, మదనికగా.... హంసానందిని, అంబదేవునిగా.... జయప్రకాష్‌రెడ్డి, గణపాంబగా.... అదితి చంగప్ప, కోటారెడ్డిగా.... ఆహుతి ప్రసాద్, టిట్టిబిగా..... వేణుమాధవ్,ప్రసాదాదిత్యగా .....అజయ్ కనిపించనున్నారు.

ఎవరెవరు

ఎవరెవరు

ఈ చిత్రానికి సంగీతం : ఇళయరాజా, ఆర్ట్: తోట తరణి, ఫోటోగ్రపీ : అజయ్ విన్సెంట్, కాస్టూమ్స్ : నీతా లుల్లా(జోధా అక్భర్ ఫేం), ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్, విఎఫ్ ఎక్స్ : కమల్ కణ్ణన్, మాటలు : పరుచూరి బ్రదర్స్, పాటలు : సిరివెన్నెల, మేకప్ : రాంబాబు, నిర్మాత-కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : గుణ శేఖర్.

English summary
Allu Arjun is all gung-ho about playing the role of Gona Ganna Reddy in Rudhramadevi. The stylish star underwent extensive training in sword fighting and other martial art forms to get into the skin of the role.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu