»   » ఇదెక్కడి షాకు?? దువ్వాడ జగన్నాథం అండర్ కవర్ పోలీసా?

ఇదెక్కడి షాకు?? దువ్వాడ జగన్నాథం అండర్ కవర్ పోలీసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న చిత్రం 'దువ్వాడ జగన్నాథం' ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఈ వేసవి కాలంలో దువ్వాడ జగన్నాదం సినిమాను రిలీజ్‌ చేయనున్నారు. గత వేసవికాలంలో వచ్చిన సరైనోడు బాక్స్‌ఫీస్‌వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం అందరికీ తెలిసిందే....

ఇక బన్నీకి సమ్మర్‌ సెంటిమెంట్‌ కలిసిరావడంతో ఈ సినిమాను కూడా వేసవికాలంలోనే విడుదల చేయాలని బన్నీ భావిస్తున్నాడట. దువ్వాడ జగన్నాదం చిత్రం టీజర్ కొచ్చినన్ని కామెంట్స్... ఈ మధ్య కాలంలో బన్నీ నటించిన ఏ ఫిల్మ్ కు రాలేదు.ఈ ఫిల్మ్ కు ఇంతలా నెగిటివ్ టాక్ రావడానిక ప్రధాన కారణం పవన్ ఫ్యాన్సే ననే అభిప్రాయంలో బన్నీ ఫ్యాన్స్ ఉన్నారు. సరే ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు డీజే గురించి వినిపిస్తున్న కథ ఇంకో షాక్ ఇస్తోంది.

Allu Arjun plays undercover cop in Duvvada Jaggandham?

అయితే ఫస్ట్‌లుక్‌లో కనిపించిన రూపం వెనుక అసలు రూపం ఇంకొకటి ఉందనీ, అది పోలీస్‌ రూపమనీ ప్రచారం జరుగుతోంది. బన్నీ ఈ చిత్రంలో అండర్‌కవర్‌ పోలీస్‌ కేరక్టర్‌ చేస్తున్నాడని, కథ ప్రకారం బ్రాహ్మణ వంటవాడి వేషమేస్తాడనేది ఒక ఇంగ్లీష్‌ టాబ్లాయిడ్‌ కథనం. రెండేళ్లకు పైగా టాలీవుడ్‌కు విరామమిచ్చి ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్న పూజా హెగ్డే గ్లామర్‌ ఈ సినిమాకు స్పెషల్‌ ఎట్రాక్షన్.

పవన్ కల్యాణ్‌తో 'గబ్బర్‌సింగ్‌' వంటి బ్లాక్‌బస్టర్‌ రూపొందించి, 'రామయ్యా వస్తావయ్యా'తో వెనక్కు తగ్గి, 'సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌'తో సరేననిపించుకొన్న హరీశ్ శంకర్‌ చాలా కసిగా ఈ సినిమా తీస్తున్నాడు. దిల్‌ రాజుకు నిర్మాతగా ఇది 25వ సినిమా కావడంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. . 'డీజే'గా వస్తున్న బన్నీ.. సమ్మర్‌లో ఆడియెన్స్‌పై పన్నీటి జల్లు కురిపించేందుకు సిద్ధమవుతున్నాడు.

English summary
Allu Arjun is playing an undercover cop in the garb of a brahmin priest in his next film Duvvada Jaggandham (DJ), HT has learnt. He has also shed weight for the role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu