For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్, ప్రభాస్ చేతికి మహేష్ సినిమా.. మహర్షి క్రేజ్‌ను సొమ్ము చేసుకొనేందుకు...

  |

  నేటితరం యంగ్ హీరోలు సినిమాలతో పాటు తమ సినిమాలకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్నారు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు తమ బిజినెస్ నెట్ వర్క్‌ని బాగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్‌లు తమ సొంత బ్యానర్స్ ఏర్పాటు చేసుకొని సినిమాలు రూపొందిస్తుండగా.. అదే బాటలో పయనిస్తూ ఇటీవలే మహేష్ బాబు ఏఎంబీ సినిమాస్ పేరుతో భారీ మల్టీప్లెక్స్ థియేటర్ ఓపెన్ చేశారు. ఇదిలా ఉండగా మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'మహర్షి' విషయంలో ప్రభాస్, అల్లు అర్జున్‌లకు చెందిన సంస్థలు ఇన్వాల్వ్ అయ్యాయని తెలుస్తోంది. మహేశ్ మహర్షి‌పై ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ని క్యాచ్ చేసుకోవాలని ప్లాన్ చేశాయట.

  యూవీ, గీతాకు మహర్షి

  యూవీ, గీతాకు మహర్షి

  మహర్షి సినిమా హక్కుల విషయంలో ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజుతో యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు డీల్ కుదుర్చుకున్నాయని తెలుస్తోంది. గతంలో కూడా సినిమా పంపిణీ విభాగంలో దిల్ రాజుతో ఈ రెండు సంస్థలకు మంచి అనుబంధం ఉంది. ఆ బంధాన్ని కొనసాగిస్తూ మహేష్ బాబు ‘మహర్షి' రూపంలో మరో మెట్టు పైకి వెళ్లాలనేదే వారి ఆలోచనట.

   6 కోట్లకు కృష్ణా జిల్లా రైట్స్

  6 కోట్లకు కృష్ణా జిల్లా రైట్స్

  మహర్షి సినిమాకు సంబంధించి కృష్ణా జిలాకు చెందిన రైట్స్ చేజిక్కించుకున్నారట. ఈ జిల్లాలో మహర్షి సినిమాకు మొత్తం 6 కోట్ల ప్రీ రీలీజ్ బిజినెస్ జరగగా.. ఆ మొత్తాన్ని ఈ ముగ్గురూ సమానంగా పంచుకొని పెట్టుబడులు పెట్టారని తెలుస్తోంది. దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 2 కోట్లు పెట్టగా.. ప్రభాస్ కి చెందిన యూవీ క్రియేషన్స్ 2 కోట్లు, అల్లు అర్జున్ కి చెందిన గీతా ఆర్ట్స్ మరో రెండు కోట్లు పెట్టారని సమాచారం. కాబట్టి వచ్చిన లాభంలో కూడా ఈ మూడు సంస్థలు సమానంగా పంచుకోనున్నాయి. ఈ రకంగా మహేష్ సినిమా విషయంలో ప్రభాస్, అల్లు అర్జున్ కూడా ఎంటరయ్యారన్నమాట.

  నిర్మాతల మధ్య వివాదం

  నిర్మాతల మధ్య వివాదం

  మరోవైపు మహర్షి సినిమాకు సంబంధించి ఓ ఏరియా థియేట్రికల్ రైట్స్ వ్యవహారంలో నిర్మాతల మధ్య బేధాభిప్రాయాలు తలెత్తాయని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ మ్యాటర్ లోకి మహేష్ ఎంటరావడంతో ఆ వివాదం సద్దుమణిగిందని తెలుస్తోంది. ఇటీవలే జరిగిన మహర్షి ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాతలు ముగ్గురూ ఎంతో సంతోషంగా కలిసి ఉండటమే ఇందుకు నిదర్శనం.

  మహేష్ 25వ చిత్రంపై భారీగా

  మహేష్ 25వ చిత్రంపై భారీగా

  ఈ సినిమా మహేష్ కెరీర్ లో రాబోతున్న 25 వ సినిమా. కాబట్టి ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలు ఊహాతీతం. ఇక బడా నిర్మాతలైన దిల్ రాజు, అశ్వినీదత్, పీవీపీలు సంయుక్తంగా నిర్మాణంలో భాగస్వాములు కావడం సినిమాకు ప్లస్ పాయింట్. వంశీ పైడిపెల్లి రూపొందిస్తున్న ఈ సినిమాలో యూత్, ఫ్యామిలీ, మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు పొందుపర్చడం మరో విశేషం. చిత్రంలో మహేష్ సరసన అందాల భామ పూజా హెగ్డే చిందులేయగా.. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు.

  జోరుగా మహేష్ టీమ్

  జోరుగా మహేష్ టీమ్

  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సోషల్ మీడియాలో హంగామా చేస్తుండగా.. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మహేష్ బాబు, పూజా హెగ్డే, ఇతర యూనిట్ సభ్యులు తెగ సందడి చేస్తున్నారు. మే 9 వ తేదీన ఈ చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది.

  English summary
  Maharshi romantic action drama film written and directed by Vamsi Paidipally and produced by Dil Raju, C. Ashwini Dutt and Prasad V. Potluri, under the banners of Sri Venkateswara Creations, Vyjayanthi Movies and PVP Cinema.The film stars Mahesh Babu, Pooja Hegde in the lead roles, with Allari Naresh,Ananya and Meenakshi Dixit in prominent roles and music is composed by Devi Sri Prasad.It is to be released on 9 May 2019. In this occcasion, Film unit organised a Pre release event at Hyderabad Neckles Road on May 1st.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X