»   » నిత్యామీనన్‌లో తప్ప ఎవరిలో ఆ క్వాలిటీ లేదు: అల్లు అర్జున్

నిత్యామీనన్‌లో తప్ప ఎవరిలో ఆ క్వాలిటీ లేదు: అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రుద్రమదేవి చిత్రంలో అల్లు అర్జున్ గోన గన్నారెడ్డి అనే పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఎంతో కీలకమైన పాత్ర. తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగొందుతున్న అల్లు అర్జున్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకోవడం ఆసక్తికరం.

మన సంస్కృతి, చరిత్రను గురించి చెప్పే సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమాను తెరకెక్కిస్తున్న గుణశేఖర్ కు అండగా నిలవాలనే మంచి ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. మరి ఇలాంటి పాత్రను ఒప్పుకోవడంపై అల్లు అర్జున్ తాజాగా ఇంటర్వ్యూలో స్పందించారు.

Allu Arjun praises Nitya Menon

ఈ విషయమై అల్లు అర్జున్ మాట్లాడుతూ రిస్కీ ప్రాజెక్ట్ అనే విషయం తెలిసి ధైర్యంగా ఈ సినిమాను అంగీకరించాను. ఈ సినిమా విడుదల విషయంలో సందేహం ఉండేది. అలాగే హీరోగా ఉన్నప్పుడు ఇలాంటి పాత్ర చేయడం అవసరమా? ఎందుకు రిస్క్ తీసుకోవడం అని కొందరు తనతో అన్నట్లు అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

తెలుగు సినిమాల్లో ఉండే మంచి లక్షణమే నన్ను ఈ సినిమాను అంగీకరించేలా చేసింది. ప్రస్తుతం హాలీవుడ్ నటులు కూడా కథానుగుణంగా చిన్న పాత్రలు వేస్తుంటారు. హీరోలుగా నటిస్తూనే మంచి కథాంశాలతో కూడిన సినిమాల్లో భాగమవుతున్నారు. ఈ మధ్య కాలంలో నిత్యామీనన్‌లో తప్ప ఎవరిలో ఇలాంటి క్వాలిటీ చూడలేదు. హీరోయిన్‌గా నటిస్తూనే నచ్చిన సినిమాలు చేస్తోందామె. వృత్తిపరమైన దృక్కోణం నుంచి ఆలోచించి ఈ సినిమాలో నటించాను అని అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

English summary
Allu Arjun praises about Nithya Menon in Rudramadevi movie interview.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu