»   » హిట్ గ్యారంటీ ఇవ్వను ... మహేష్, బన్నీతో నెక్ట్స్: పూరి జగన్నాథ్

హిట్ గ్యారంటీ ఇవ్వను ... మహేష్, బన్నీతో నెక్ట్స్: పూరి జగన్నాథ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : కోట్ల మంది ప్రేక్షకులను రెండున్నర గంటలపాటు థియేటర్‌లో కూర్చోబెట్టడం చాలా కష్టమైన పిని, తాము తీసే చిత్రం తప్పక విజయవంతమవుతుందన్న గ్యారంటీ ఎవ్వరూ ఇవ్వలేరని, సినిమా నిర్మాణం మొదలుపెట్టినప్పుడు ఈ చిత్రం వర్కవుట్ అవుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్ళడమే తమ పని అని అంటున్నారు స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్.

తన తర్వాతి సినిమాల గురించి వెల్లడిస్తూ....త్వరలో బాలీవుడ్‌లో తన దర్శకత్వంలో తెలుగులో విజయవంతమైన చిత్రాలను రీమేక్ చేయనున్నామని, ఇందులో మహేష్‌బాబుతో లవ్ యాక్షన్ స్టోరీ చిత్రం ఒకటి, బన్నీతో మరో చిత్రం చేయనున్నానని ఆయన వివరించారు.

'ఇద్దరమ్మాయిలతో..' సినిమా గురించి వెల్లడిస్తూ.....ఇప్పటి వరకు ఈ సినిమాకు వచ్చిన షేర్స్ అల్లు అర్జున్ గత చిత్రాలను మించి వచ్చాయని, మూడు రోజుల్లో అల్లు అర్జున్ చిత్రాల కలక్షన్లను ఈ చిత్రం అధిగమించిందని, మరో నాలుగైదు రోజుల్లో ఈ చిత్రం ఎంత పెద్ద రేంజ్‌కి వెళ్తుందో తెలుస్తుందని ఆయన వివరించారు.

'ఇద్దరమ్మాయిలతో' కథను హీరో, నిర్మాతకు నచ్చిన తర్వాతే సినిమాగా తీయడానికి సెట్స్‌కు వెళ్లామని, ఓ పొయిటిక్ కథను తీసుకుని, కమర్షియల్ హంగులు చేర్చి నిర్మించిన ఈ చిత్రం అందరికీ ఆనందాన్ని ఇస్తోందని, ముఖ్యంగా అల్లుఅర్జున్ అభిమానులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు పూరి జగన్నాథ్ తెలిపారు. ఏ సినిమాకు అయినా రెండు విధాల టాక్ ఉంటుంది. సినిమా హిట్టా ఫట్టా అనేది చివరగా నిర్ణయించేది ప్రేక్షకులే అన్నారు.

English summary
Allu Arjun and Puri Jagannadh have decided to team up again, post the release of Iddarammayilatho. Talking to the media earlier today, Puri Jagannadh said, “Allu Arjun has gone through a massive transformation both as an actor and a person.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu