»   »  అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’ జెనీవా

అల్లు అర్జున్ ‘రేస్ గుర్రం’ జెనీవా

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, కిక్ దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో 'రేస్ గుర్రం' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత సంవత్సరం అక్టోబర్లోనే ఈ చిత్రం అఫీషియల్ గా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈచిత్రం షూటింగ్ ఈ రోజు(జులై 3) నుండి యూరఫ్‌లోని జెనీవాలో ప్రారంభమైంది.

జెనీవాలో షూటింగ్ పూర్తయిన తర్వాత యూరఫ్‌లోని ఇతర లొకేషన్లలో షూటింగ్ జరుగనుంది. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏ మాయ చేసావెకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈచిత్రానికి పని చేస్తున్నారు

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

అల్లు అర్జున్ సరసన శృతి హీసన్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్యామ్, ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary

 Stylish Star Allu Arjun and Surender Reddy have teamed up for the film ‘Race Gurram’. The European schedule of this film started today in Geneva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu