»   » బన్ని ‘రేసుగుర్రం’ లేటెస్ట్ ఇన్పో

బన్ని ‘రేసుగుర్రం’ లేటెస్ట్ ఇన్పో

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : అల్లు అర్జున్‌, శ్రుతీహాసన్‌ జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రేసుగుర్రం'. ఈ సినిమాకి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. బన్నీ ఇమేజ్‌కి తగ్గట్టుగా 'రేసుగుర్రం' చిత్రాన్ని ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారు నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రుతిహాసన్ హీరోయిన్. 'కిక్' శ్యామ్, సలోని కీలకపాత్రలు పోషిస్తున్నారు.

నిర్మాతలు మాట్లాడుతూ -''ఈ సినిమాలో వినోదం పాళ్లు అధికంగా ఉంటాయి. బన్నీ కెరీర్‌లోనే ఫుల్‌లెంగ్త్ ఎంటర్‌టైనర్ ఇదే'' అని చెప్పారు. ఈ నెల 5 నుంచి మరో షెడ్యూలు మొదలు కానుంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో బన్నీ నటించడం ఇదే ప్రథమం. యాక్షన్ ఎంటర్‌టైనర్లు తీయడంలో సురేందర్‌రెడ్డికి ఓ ప్రత్యేకమైన శైలి ఉంది.
2014 సంక్రాంతికి 'రేసుగుర్రం'ను విడుదల చేయాలనేది నిర్మాతల ప్లాన్ చేస్తున్నారు.


ఇటీవలే విదేశాల్లో షూటింగ్‌ జరుపుకొని ఇండియాకి తిరిగొచ్చింది ఈ చిత్ర బృందం. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తొలిసారిగా యస్‌.యస్‌.థమన్‌ బన్ని చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో సంగీతంపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలే నెలకొన్నాయి. థమన్‌ కూడా చక్కటి బాణీలు అందించడానికి తన శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నాడట.

నల్లమలపు శ్రీనివాస్‌(బుజ్జి). డాక్టర్‌ వెంకటేశ్వరరావు నిర్మాతలు. ఇద్దరమ్మాయిలతో... సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయం చెందిన తరువాత బన్ని చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్‌ కొట్టాలని భావిస్తున్నాడు. అలాగే ఊసరవెల్లి సినిమా తరువాత సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. ఇతనికీ ఈ సినిమా విజయం ఎంతో అవసరం ఉంది. ఎందుకంటే ఊసరవెల్లి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది.ఈ చిత్రంలో సలోని సెకండ్ హీరోయిన్‌గా కనిపించనుంది. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary
Allu Arjun’s forthcoming flick ‘Race Gurram’, under the direction of Surender Reddy is currently shooting at the Golconda fort in Hyderabad with a brisk pace. Thaman S.S is scoring music for the action-comedy entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu