Just In
- 1 hr ago
శివరాత్రికి ‘శ్రీకారం’.. శర్వానంద్ సందడి అప్పుడే!
- 1 hr ago
ట్రెండింగ్ : బాగానే వాడుకుంటున్నారు.. గుండెపై పచ్చబొట్టు.. రాహుల్ మీదకు ఎక్కేసిన అషూ రెడ్డి
- 2 hrs ago
HBD Namrata.. ఐదేళ్లలో 29 హెల్త్ క్యాంప్స్.. అందుకే మహేష్ బాబుకు ఇంతటి క్రేజ్!
- 3 hrs ago
‘ఖిలాడీ’ అప్డేట్.. రవితేజ మరీ ఇంత ఫాస్ట్‌గా ఉన్నాడేంటి!
Don't Miss!
- News
జైలు నుంచి భూమా అఖిలప్రియ విడుదల, అన్నీ వివరాలు వెల్లడిస్తా.. సిటీ వదిలి వెళ్లొద్దు
- Sports
గాయపడ్డా.. బౌలింగ్ చేశా! అందుకు అదోక్కటే కారణం: సైనీ
- Finance
గోఎయిర్ బంపర్ ఆఫర్... అతి తక్కువ ధరకే విమాన టికెట్... ఇవీ వివరాలు...
- Lifestyle
మీరు దీన్ని తింటే, అన్ని వ్యాధులు A to Z మాయం అవుతాయి ...
- Automobiles
నిస్సాన్ మాగ్నైట్ అప్డేట్: 35,000కి పైగా బుకింగ్స్, 2 లక్షలకు పైగా ఎంక్వైరీస్
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
మెగా మేనల్లుడిపై రామ్ చరణ్, అల్లు అర్జున్ కామెంట్స్.. వైరల్ అవుతున్న ట్వీట్స్
మెగా ఫ్యామిలీ నుంచి ఎందరో హీరోలు టాలీవుడ్ గడపతొక్కి విజయవంతంగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లాంటి హీరోలైతే మెగా వారసులుగా భారీ పాపులారిటీ సంపాదించారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌పై రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేశారు.

సాయి ధరమ్ తేజ్.. ప్రతిరోజూ పండగే
సాయి ధరమ్ తేజ్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే'. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతూ హిట్ టాక్ తెచ్చుకుంది. అల్లు అరవింద్ సమర్పణలో బన్ని వాసు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటించింది. సత్యరాజ్ కీలక పాత్రలో నటించాడు.

రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫిదా
ఫ్యామిలీ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటున్న ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. తాజాగా ఈ సినిమా చూసిన మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫిదా అయ్యారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సినిమాపై, నటీనటులపై తమ స్పందన తెలిపారు.
మెగా పవర్ స్టార్ ఏమన్నారంటే..
‘ప్రతిరోజూ పండగే' సినిమా చూసిన రామ్ చరణ్.. చిత్ర యూనిట్‌ను అభినందించాడు. కుటుంబ విలువలను కళ్ళకు కట్టినట్లు చూపుతూ ఎంటర్‌టైన్ చేసిన ఈ చిత్రాన్ని అందరూ తప్పకుండా చూడాలని చెర్రీ అన్నారు. ఈ మేరకు సాయి ధరమ్ తేజ్, మారుతి ప్రతిభలను కొనియాడారు.
|
మా నాన్న అల్లు అరవింద్‌కు.. అల్లు అర్జున్ కామెంట్
అదేవిధంగా మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా ‘ప్రతిరోజూ పండగే' చిత్రం చూసి రియాక్ట్ అయ్యారు. ఈ చిత్రంతో నా కజిన్ సాయి ధరమ్ తేజ్ మంచి హిట్ అందుకున్నాడని, నా మిత్రుడు మారుతి ఈ చిత్రాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడని అల్లు అర్జున్ పేర్కొన్నారు. అంతేకాదు బన్నివాసు ఈ సినిమాతో మంచి హిట్టు అందుకున్నాడని, ఈ సినిమాతో మా నాన్న అల్లు అరవింద్‌కు, యూవీ క్రియేషన్స్ వాళ్లకు మంచి లాభాలొచ్చాయని బన్నీ తెలిపారు.