»   » సిక్స్‌ ప్యాక్‌ పెంచటానికి కారణం అదే: అల్లు అర్జున్

సిక్స్‌ ప్యాక్‌ పెంచటానికి కారణం అదే: అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్...సిక్స్ ప్యాక్ ట్రెండ్ కు రీసెంట్ కాలంలో శ్రీకారం చుట్టిన హీరో. అసలు సిక్స్ పాక్ హఠాత్తుగా పెంచటానికి కారణం చెబుతూ...ఓ బాలీవుడ్‌ భామ వెటకారం చేసిందని సిక్స్‌ ప్యాక్‌ చేశాను అన్నారు. అయితే ఆ హీరోయిన్ ఎవరన్నది చెప్పలేదు. 'దేశముదురు' చిత్రంలో మొదటి సారిగా అల్లు అర్జున్ సిక్స్ పాక్ సృష్టించి ట్రెండ్ కు నాంది పలికారు. ఇక పెద్దగా పెంచిన జుట్టు గురించి మాట్లాడుతూ...లాంగ్‌ హెయిర్‌ అంటారా ట్రెండ్‌కి తగ్గట్టుగా వెళ్లాను. చాన్నాళ్లుగా ఈ జుట్టు ఎక్కువైపోయి ఉంది. తగ్గిద్దాం అనుకొంటే 'బద్రీనాథ్‌'కి ఆ మాత్రం జుట్టు అవసరం అన్నారు. ఆ తరవాత కట్‌ చేస్తా. ఈ మధ్యనే అమెరికా వెళ్లి వచ్చాను. అక్కడ వచ్చిన కొత్త ఫ్యాషన్స్‌ పరిశీలించాను. లెనిన్‌ ఫ్యాబ్రిక్‌ తో రకరకాల డిజైన్స్‌ చేశారు. చాలా బాగున్నాయి. వాటిని మన దగ్గరకు తెచ్చే ఆలోచనలో ఉన్నాను అంటూ తను ఫాలో అవుతున్న ట్రెండ్ గురించి చెప్పుకొచ్చారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu