అల.. వైకుంఠపురములో సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?

తెలుగు తెరపై మరోసారి తన స్టామినా చూపించేందుకు రెడీ అయ్యాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. 'నా పేరు సూర్య' సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ యంగ్ హీరో సంక్రాంతి కానుకగా 'అల.. వైకుంఠపురములో' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్దమయ్యాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా తాజాగా సెన్సార్ పూర్తిచేసుకుంది.

'అల.. వైకుంఠపురములో' సినిమా చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికెట్ జారీ చేశారు. చిత్రం అంతా చాలా క్లాస్‌గా సూపర్ సీన్స్‌తో తెరకెక్కిందని అన్నారట సెన్సార్ సభ్యులు. ఇక ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 45 నిమిషాలు అని సెన్సార్ సర్టిఫికెట్ రిలీజ్ చేస్తూ తెలిపింది చిత్రయూనిట్.

Allu Arjuns Ala Vaikunthapurramloo Censor Completed

గీతా ఆర్ట్స్ బ్యానర్‌, హారిక & హాసిని క్రియేషన్స్ సంయుక్త సమర్పణలో భారీ హంగులతో రూపొందింది 'అల.. వైకుంఠపురములో' మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ హీరోయిన్ టబు, కమెడియన్ సునీల్ కీలక పాత్రలు పోషించారు.

అల్లు అర్జున్ గత సినిమా హిట్ కాకపోవడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ పెట్టారు బన్నీ, త్రివిక్రమ్. ఈ మేరకు షూటింగ్ చేస్తూనే 'అల.. వైకుంఠపురములో' అప్‌డేట్స్, పాటలు విడుదల చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేశారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X