»   » ఇదీ 'బద్రీనాధ్'పై అస్సలు నిజం: వివి వినాయిక్

ఇదీ 'బద్రీనాధ్'పై అస్సలు నిజం: వివి వినాయిక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అందరూ బద్రినాథ్‌ చిత్రాన్ని సోషియో ఫాంటసీ తరహా కథాంశం అనుకొంటున్నారు.కానీ నిజానికి ఇదో ప్రేమకథ.కాకపోతే యాక్షన్‌ సన్నివేశాలకు అధిక ప్రాధాన్యమిచ్చాం అంటూ తేల్చేసారు దర్సకుడు వివి వినాయిక్.అలాగే ఈ సినిమాపై పలు అంచనాలున్నాయి.వాటిని తప్పకుండా అందుకొంటాం అని హామీ ఇచ్చారు.అల్లు అర్జున్ హీరోగా తమన్నా హీరోయిన్ గా గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం పాటల్ని ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఇలా స్పందించారు.

ఇక చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ...మా బన్నీ తొలి సినిమా 'గంగోత్రి'కి కథ అందించిన చిన్నికృష్ణ మళ్లీ ఓ మంచి కథ సిద్ధం చేశారు. కీరవాణి సంగీతం ఓ ప్రధాన ఆకర్షణ. పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వం వహించిన యాక్షన్‌ ఘట్టాలు తప్పకుండా అలరిస్తాయి. త్వరలోనే పాటల్ని విడుదల చేస్తాం. మే ద్వితియార్థంలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని అన్నారు. ప్రకాష్‌రాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: చిన్నికృష్ణ, కళ: ఆనంద్‌సాయి, ఛాయాగ్రహణం: ఎస్‌.రవివర్మన్‌, కూర్పు: గౌతంరాజు, నిర్మాణ సారథ్యం: ఠాగూర్‌ మధు.

English summary
Allu Arjun's ‘Badrinath’ is yet another mega budget flick coming from prestigious Geetha Arts Banner.The film is said to be a high-voltage action-packed, romantic entertainer with a completely new storyline and subject.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu