»   » అల్లు అర్జున్ ‘వధువు’ తెలిసిపోయిందోచ్!

అల్లు అర్జున్ ‘వధువు’ తెలిసిపోయిందోచ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతోన్న 'వరుడు" చిత్రంలో హీరోయిన్ ఎవరనే విషయాన్ని దర్శక నిర్మాతలు దాచిపెడుతూ వచ్చారు. ఈ విషయం పై దర్శకనిర్మాతల మధ్య స్వల్స మనస్పర్థాలు కూడా చోటు చేసుకొన్న విషయం విదితమే. అయితే ఇప్పటిదాకా అంటే వరుడు ఆడియో రిలీజ్ లో కూడా సినిమాకి సంబంధించిన స్టిల్స్ లోగానీ, ప్రమోస్ లోగానీ హీరోయిన్ ని చూపించకుండా దర్శక నిర్మాతలు జాగ్రత్తపడినా, ఇంటర్నెట్ లో బన్నీ 'వధువు" ఫోటోలు మాత్రం లీక్ అయిపోయాయి.

అయితే ఆడియో వేడుకలో కూడా అమ్మాయిని సినిమా విడుదల తర్వాతే ప్రేక్షకులు ఒకేసారి చూడాలని ఫోటోలు విడుదల చేయలేదని గుణశేఖర్ అన్నాడు. మరి ఈ చిత్రం ద్వారా భాను మెహరాని కథానాయికగా పరిచయం చేస్తున్నారు. పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దగుమ్మే బన్నీ సరసన 'వరుడు" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోన్న'వధువు". ఈమె బాలీవుడ్ లో ఓ సినిమాలో చిన్న పాత్ర పోషించిన ఈ అమ్మడికి, 'వరుడు" హీరోయిన్ గా తొలి చిత్రమనే చెప్పుకోవాలి. సో అల్లు అర్జున్ ఫాన్స్ కి 'వరుడు" నాయిక ఎవరనేది తెలిసిపోయిందని. ఈ అమ్మడు చాలా క్యూట్ గా ఉందనే కాంప్లిమెంట్స్ కూడా లభిస్తున్నాయి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu