»   » ‘డిజె’ ట్రైలర్ సంచలనం... ఇంతలోనే భారీ రెస్పాన్స్, డిస్ లైక్స్ కూడా!

‘డిజె’ ట్రైలర్ సంచలనం... ఇంతలోనే భారీ రెస్పాన్స్, డిస్ లైక్స్ కూడా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా హరీష్ శంకర్ నిర్మాతగా తెరకెక్కుతున్న దువ్వాడ జగన్నాధమ్(డిజె) మూవీ అఫీషియల్ ట్రైలర్ సోమవారం సాంత్రం 7.30 గంటలకు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ కు ఎవరూ ఊహించని విధంగా భారీ స్పందన వచ్చింది.

ట్రైలర్ విడుదలైన గంటలోనే లక్ష వ్యూస్ సొంతం చేసుకుంది. సోమవారం రాత్రి ట్రైలర్ విడుదలైతే మంగళవారం ఉదయం 7.30 గంటలు సమానికి వ్యూస్ సంఖ్య 25 లక్షలు క్రాస్ అయింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ట్రైలర్ విడుదలైనా ఇంత భారీ స్పందన రావడం విశేషం.


భారీగా డిస్ లైక్స్

భారీగా డిస్ లైక్స్

అదే సమయంలో డిజే ట్రైలర్ కు భారీ సంఖ్యలో డిస్ లైక్స్ కూడా వచ్చాయి. 12 గంటల్లో 2.5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న ఈ ట్రైలర్ 87 వేలకు పైగా లైక్స్, 28 వేలకు పైగా డిస్ లైక్స్ సొంతం చేసుకుంది.


కావాలనే చేస్తున్నారా?

కావాలనే చేస్తున్నారా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఏ హీరో సినిమా ట్రైలర్ విడుదలైనా ఈ స్థాయిలో డిస్ లైక్స్ రాలేదు. అయితే బన్నీ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైనా, సాంగ్ విడుదలైనా భారీగా డిస్ లైక్స్ వస్తున్నాయి. కొందరు యాంటీ ఫ్యాన్స్ కావాలనే ఇదంతా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.


ఆ గొడవే కారణం

ఆ గొడవే కారణం

ఆ మధ్య అల్లు అర్జున్ కు, పవన్ కళ్యాణ్ అభిమానులకు గొడవ జరిగిన తర్వాత నుండి ఈ డిస్ లైక్స్ వ్యవహారం ఎక్కువైంది. డిస్ లైక్స్ వెనక ప్రధాన కారణం అదే అని అంటున్నారు.


జూన్ 23

జూన్ 23

సినిమాను జూన్ 23న విడుదల చేసేందుకు నిర్మాత దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బన్నీ కెరీర్లోనే సినిమా మొమెరబుల్ హిట్ అవుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.English summary
Allu Arjun's Dj trailer crossed 2.5 Million views in just 12 hours. Duvvada Jagannadham or DJ is an upcoming Telugu action comedy film co written and directed by Harish Shankar and produced by Dil Raju under his banner Sri Venkateswara Creations. The film stars Allu Arjun and Pooja Hegde in lead roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu