»   » ' ఏక్‌ దో తీన్‌ చార్‌' అంటున్న బన్ని

' ఏక్‌ దో తీన్‌ చార్‌' అంటున్న బన్ని

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ అల్లు అర్జున్‌ సినిమా అనగానే ప్రేక్షకులకు గుర్తొచ్చేది.. డాన్స్‌. ప్రతి పాటనూ సరికొత్త రీతిలో ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తాడు. మైమరపించే నృత్యాలకు చిరునామాగా మారారు. కొత్త చిత్రం 'రేసుగుర్రం'లోనూ అలాంటి స్టెప్పులు చూడొచ్చు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'రేసు గుర్రం' లోనూ అలాంటి పాట ఒకటి అదరకొట్టనుంది. అదే....'ఏక్‌ దో తీన్‌ చార్‌ పాంచ్‌ పఠాకా నీకూ నాకూ' . ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

అల్లుఅర్జున్‌, శ్రుతిహాసన్‌లపై ఈ హుషారైన గీతం తెరకెక్కిస్తున్నారు. 'ఏక్‌ దో తీన్‌ చార్‌ పాంచ్‌ పఠాకా నీకూ నాకూ' అంటూ సాగే ఈ గీతానికి జానీ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. పేరుకు తగ్గట్టు అల్లు అర్జున్‌ పాత్ర తీరు జెట్‌ స్పీడుతో ఉంటుందని చెప్తున్నారు. వినోదం, యాక్షన్‌ల మేళవింపు కథలో కనిపిస్తుందని యూనిట్ చెబుతోంది. ఇటీవలే విదేశాల్లో రెండు పాటల్ని చిత్రీకరించారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.మాటల్లో చెప్పలేనిది చూపించాం అని చెప్తున్నారు.


తన పాత్ర గురించి సలోని మాట్లాడుతూ.... ''ఈ సినిమాలో నా పాత్ర పూర్తిగా సంప్రదాయబద్ధంగా సాగుతుంది. ఎక్కువ భాగం చీరకట్టులోనే కనిపిస్తా. నటనకు అస్కారం ఉన్న పాత్ర దక్కడం నా అదృష్టం'' అని చెబుతోంది సలోని. మరి ఇలాంటి పాత్రలో ఈ 'తెలుగమ్మాయి' ఎలా ఒదిగిపోతుందో చూడాలి. హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న 'తెలుగమ్మాయి' నిరాశపరిచింది. వెంకటేష్‌ సినిమా 'బాడీగార్డ్‌'లో నటించినా ఆమె పాత్రకు తగిన గుర్తింపు రాలేదు. సలోని కెరీర్‌ ఏమైపోతుందో అనుకొంటున్న దశలో ఈ అవకాశం ఆమె ముంగిట వాలింది.

ఈ చిత్రానికి టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ఇచ్చిన మ్యూజిక్‌పై తన అభిప్రాయాన్ని వెలుబుచ్చాడు అల్లు అర్జున్. ఫేస్‌బుక్‌లో అల్లు అర్జున్ స్పందిస్తూ...'రేస్ గుర్రం చిత్రం కోసం తమన్ ఎక్సలెంట్ సాంగ్స్ ఇచ్చాడు. సినిమా ఆడియో విడుదల ఎప్పుడు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాటలు సూపర్ హిట్టవడం ఖాయం' అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

కిక్‌ సినిమాతో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్‌గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary
Currently, Allu Arjun is shooting for the dance number 'Ek Do Teen Chaar Panch Pathaka...Neeku Naaku' for his upcoming film 'Race Gurram' in a lavish set erected at Annapurna Studios. Shruti Haasan is one of those very few actresses who are equally good in acting and dancing. She too has been participating in the shoot and her rapport with Bunny is going to be a talking point after the release. This peppy number which is aimed for the pre-climax block is going to set the tempo high with some highly energetic compositions from music director SS Thaman and choreographer Johnny Master.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu