»   »  లెక్కలు చెప్తున్న అల్లు అరవింద్, బిజినెస్ హైప్ కోసమా?

లెక్కలు చెప్తున్న అల్లు అరవింద్, బిజినెస్ హైప్ కోసమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా బిజినెస్ కోసం నిర్మాతలు హైప్ క్రియేట్ చేస్తూండటం కామనే. ముఖ్యంగా ఖర్చు గురించి పబ్లిక్ గా పబ్లిసిటీ మొదలెడుతూంటారు. ఇప్పుడు అల్లు అరవింద్ తమ తాజా చిత్రం గురించి లెక్కలు చెప్పటం అందుకే అంటున్నారు.

అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం 'సరైనోడు'. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. అంజలి స్పెషల్ సాంగ్ లో చిందేసింది. బోయపాటి శ్రీను దర్శకుడు. అల్లు అరవింద్‌ నిర్మాత. తమన్‌ సంగీతం అందించిన ఈ చిత్ర పాటల్ని శుక్రవారం మార్కెట్‌లోకి నేరుగా విడుదల చేశారు.

అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ''తమన్‌ అందించిన బాణీలు మాస్‌ని అలరిస్తాయి. 'బ్లాకు బ్లస్టర్‌...' గీతాన్ని ఇంతకుముందే విడుదల చేశాం. ఆ పాటకి మంచి స్పందన వస్తోంది. పోరాట ఘట్టాల్ని వినూత్న రీతిలో చిత్రీకరించాం. విశ్రాంతి ముందొచ్చే ఫైట్ సీన్ కు సుమారు రూ.కోటి వ్యయంతో తెరకెక్కించాం. ఈనెల 10న విశాఖపట్నంలో 'సరైనోడు' ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా నిర్వహిస్తున్నాం. 22న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''అన్నారు.

Allu Arjun’s Most Expensive Interval Bang

ఈ చిత్రంలో హీరోయిన్ అంజలి ఆడిపాడిన స్పెషల్ సాంగ్ 'బ్లాక్‌బస్టర్‌..'. రీసెంట్ గా ఈ సాంగ్ ప్రొమోను ఇటీవల విడుదల చేస్తే అది బ్లాక్ బస్టర్ అయ్యి కూర్చుంది.

దాంతో చిత్రం యూనిట్ తాజాగా ఈ పాటను పూర్తిగా విడుదల చేసింది. ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా థమన్‌ ఈ పాటకు అదిరిపోయే సంగీతం అందించారు. మీరూ ఓ లుక్కేయండి.

యూట్యూబ్‌లో విడుదలైన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటకు ఇప్పటి వరకూ 141,669 లైక్‌లు లభించాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మించారు. కేథరిన్‌ త్రెసా, శ్రీకాంత్‌, పనిశెట్టి ఆది, రాహుల్‌వర్మ, విద్యులేఖ రామన్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

ఏప్రిల్ 22న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఖచ్చితంగా సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని భావిస్తున్నారు.

English summary
Allu Arjun is currently focusing only on his action-entertainer “Sarainodu”. Here comes an interesting report about a most expensive interval bang shot on this mega hero.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu