twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సైనికులకు 'గ్రేట్ ట్రిబ్యూట్': గుండెను తాకేలా.. నా పేరు సూర్య సాంగ్(వీడియో)

    |

    Recommended Video

    గుండెను తాకేలా.. నా పేరు సూర్య సాంగ్

    ఓ నిప్పు రవ్వ ఎగిసిపడితే ఎలా ఉంటుందో.. 'నా పేరు సూర్య'లో అల్లు అర్జున్ క్యారెక్టరైజేషన్ అలా ఉండబోతుంది. సరిహద్దున నిలువెత్తు నిప్పు కంచెలా.. నరనరాన దేశభక్తిని నింపుకున్న నిస్వార్థ సైనికుడిగా అల్లు అర్జున్ ఇందులో కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్.. హైఓల్టేజీ ఏంటో అంటే రచి చూపించగా.. తాజాగా విడుదలైన సాంగ్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

    <strong>నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్.. </strong>నిప్పురా.. నిజంగా బ్లడ్ పెట్టి చేశాడురా..: అల్లు అర్జున్‌లో కొత్త యాంగిల్ పక్కా బ్రదర్..

    ఏంటా సాంగ్:

    గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని నా పేరు సూర్య టీమ్.. 'ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా..' అనే దేశభక్తి గీతాన్ని విడుదల చేసింది. సరిహద్దున దేశం కోసం పహారా కాసే సైనికుల కార్యదక్షతను, వారి కష్టాల్ని కళ్లకు కట్టేలా ఈ సాంగ్ సాగుతుంది. ఆడియో వింటుంటే.. రోమాలు నిక్కబొడుచుకునేలా.. అదే సమయంలో ఏదో ఆర్థ్రత వెంటాడుతున్నట్లుగా ఉంటుంది.

     గ్రేట్ ట్రిబ్యూట్:

    గ్రేట్ ట్రిబ్యూట్:

    'సరిహద్దున నువ్వే లేకుంటే.. ఏ కంటిపాప నిద్దరపోదుగా

    నిలువెత్తున నిప్పు కంచెవై నువ్వుంటేనే
    జాతి బావుటా ఎగురుతుందిరా.. పైకెగురుతుందిరా
    ఇల్లే ఇండియా.. దిల్లే ఇండియా.. నీ తల్లే ఇండియా..
    తన భరోసా నువ్వే.. దేశం కొడుకా..' తీక్షణమైన గొంతుతో సైనికులకు ఒక 'గ్రేట్ ట్రిబ్యూట్'లా ఈ పాట సాగుతుంది.

     విశాల్-శేఖర్ మ్యూజిక్:

    విశాల్-శేఖర్ మ్యూజిక్:

    చెన్నై ఎక్స్‌ప్రెస్, ఓం శాంతి, రావణ్ లాంటి బాలీవుడ్ హిట్స్ కు మ్యూజిక్ అందించిన విశాల్-శేఖర్ ద్వయం ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. నా పేరు సూర్య టీజర్‌తో దర్శకుడిగా వక్కంతం వంశీ తన స్టామినా ఏంటో చూపించగా.. తాజాగా విడుదలైన పాటతో విశాల్-శేఖర్ ద్వయం మరోసారి హిట్ ఆడియో ఇవ్వబోతుందన్న సంకేతాలు వెలువడ్డాయి.

     రాజీవ్ రవి బిగ్ హైలైట్..:

    రాజీవ్ రవి బిగ్ హైలైట్..:

    రాజీవ్ రవి లాంటి టాప్ మోస్ట్ కెమెరామెన్‌తో వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటం బిగ్ హైలైట్ అని చెప్పాలి. ఇప్పటికే విడుదలైన టీజర్‌లో రాజీవ్ తన పనితనమేంటో మరోసారి నిరూపించాడు.

    తొలిసారి దర్శకత్వం వహిస్తున్నా.. వక్కంతం వంశీ పక్కా క్లారిటీతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఏరి కోరి మరీ రాజీవ్ రవి, విశాల్ శేఖర్ లతో ఆయన పనిచేస్తుండటం.. సినిమాను మరో లెవల్‌కు తీసుకువెళ్తుందనడంలో అతిశయోక్తి లేదేమో!

    వెన్నుచూపని తనం..:

    వెన్నుచూపని తనం..:

    ఇక అల్లు అర్జున్ విషయానికొస్తే.. ఆయన్ను మునుపెన్నడూ చూడని యాంగిల్‌లో ప్రేక్షకులు చూడబోతున్నారన్న విషయం మాత్రం ఇప్పటికే స్పష్టమైంది. నరనరాన దేశభక్తి నింపుకున్న పాత్రకు హైఓల్టేజీ టచ్ ఇచ్చాడు దర్శకుడు వక్కంతం వంశీ.

    ఎక్కడా వెన్నుచూపని తనాన్ని హీరో క్యారెక్టర్‌లో బలంగా చూపించినట్లు అర్థమవుతోంది. ఏదేమైనా ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌కు ఎంత పేరు వస్తుందో.. వక్కంతం వంశీకి కూడా అంతే పేరు వస్తుందనడంలో సందేహం లేదు.

    English summary
    It's like a tribute to soldiers, Allu Arjun's 'Naa Peru Surya' team released a song on youtube. Now it's gone viral on social media platforms
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X