For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  టీజర్‌తో అదరగొట్టిన అల్లు అర్జున్.. నా పేరు సూర్య డబుల్ ఇంపాక్ట్.. ప్రశంసలు వర్షం

  By Rajababu
  |

  స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనుఇమ్మాన్యూయేల్ జంట‌గా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతూ తెరకెక్కుతున్న చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా". మెగా హీరో కే నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ , శ‌ర‌త్ కుమార్ లు ముఖ్య పాత్రల్లో న‌టిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది.ఈ చిత్రానికి సంబందించిన ఫ‌స్ట్ ఇంపాక్ట్ జ‌న‌వ‌రి 1న విడ‌దుల చేశారు. ఈ టీజ‌ర్ చూసిన వారంతా అల్లు అర్జున్ డెడికేష‌న్ గురించి, మేక్ ఓవ‌ర్ గురించి మాట్లాడుకుంటున్నారు.

   ప్రపంచానికి సూర్య అంటే

  ప్రపంచానికి సూర్య అంటే

  నీకు సూర్య సోల్జ‌ర్‌.. కానీ ప్ర‌పంచానికి సూర్య అంటే ఓ ఉద్రేకం (యాంగర్)..... అనే డైలాగ్‌తో సినిమా ఇంపాక్ట్ ప్రారంభమైంది. ఈ ఇంపాక్ట్ నిజంగానే అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌పై మంచి ప్రభావం చూపిస్తున్నది. టైటిల్ కి త‌గ్గ‌ట్టుగా అల్లు అర్జున్ తన పాత్రలో లీన‌మై న‌టించినట్టు టీజ‌ర్ చెప్పకనే చెప్పింది.

   ఫస్ట్ ఇంపాక్ట్ అదుర్స్

  ఫస్ట్ ఇంపాక్ట్ అదుర్స్

  ఏ ముహుర్తాన మెట్ట‌మొద‌టిసారిగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అన్నారో గానీ ఈ సినిమాలో సన్నివేశాలు అదే రేంజ్‌లో అదరగొట్టాయి. అంతేకాకుండా భారీ అంచనాలు నెలకొనేలా ఈ చిత్రం ఇంపాక్ట్ క‌లిగిస్తున్నది. ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్ - శేఖర్ అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు.

  అల్లు అర్జున్ డెడికేషన్

  అల్లు అర్జున్ డెడికేషన్

  నా పేరు సూర్య ఇంపాక్ట్ చూస్తే అల్లు అర్జున్ డెడికేష‌న్, ద‌ర్శ‌కుడు ప‌నితీరు, కెమెరా మెన్ విజువ‌ల్స్ తో పాటు డైలాగ్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. చ‌చ్చిపోతాను కానీ ఇక్క‌డ కాదు దేశ సరిహద్దులో చ‌చ్చిపోతాను అనే డైలాగ్ రోమాలు నిక్క‌బోడుచుకునేలా ఉంది అని సినీవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

   కాంప్రమైజ్ కాలేదు

  కాంప్రమైజ్ కాలేదు

  ఈ సంద‌ర్బంగా నిర్మాత శిరీషా శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా. అత్యంత భారీ తారాగాణం, సాంకేతిక నిపుణుల‌తో చిత్రాన్ని ఎక్కడా కాంప్ర‌మైజ్ కాకుండా తెర‌కెక్కించాం. అదే విషయాన్ని మా ఫ‌స్ట్ ఇంపాక్ట్ చూసిన వారంతా చెబుతున్నారు. బ‌న్నిడెడికెష‌న్‌, ద‌ర్శ‌కుడు విజ‌న్ క‌లిస్తే మా ఫ‌స్ట్ ఇంపాక్ట్ అని అన్నారు.

   ఏప్రిల్ 27న రిలీజ్

  ఏప్రిల్ 27న రిలీజ్

  నా పేరు సూర్య చిత్రం కూడా తెర మీద ఇదే రేంజ్‌లో చిత్రం ఉంటుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2018 ఏప్రిల్ 27న విడుద‌ల చేయ‌టానికి ప్లాన్ చేస్తున్నాం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం వేసవి కానుక‌గా వస్తున్నది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందనేది మా విశ్వాసం. ముఖ్యంగా ఫ‌స్ట్ ఇంపాక్ట్ లో డైలాగ్స్ గురించి మాట్లాడుకోవ‌టం ఆనందంగా ఉంది. అని అన్నారు

  బన్నీ కెరీర్‌లోనే తొలిసారి

  బన్నీ కెరీర్‌లోనే తొలిసారి

  చిత్ర సమర్పకుడు నాగబాబు మాట్లాడుతూ... బన్నీ కెరీర్లో‌నే హై వోల్టేజ్ యాక్షన్ లవ్ ఎంటర్టైనర్‌గా రూపొందింది. దర్శకుడు వక్కంతం వంశీ అద్భుతమైన కథా, కథనంతో కంప్లీట్ ప్యాకేజీ అందిస్తున్నాడ‌నేదానికి ఉదాహర‌ణ మా ఫ‌స్ట్ ఇంపాక్ట్‌. హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 27, 2018 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఇంపాక్ట్ తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తప్పకుండా అద్బుతమైన స‌మ్మ‌ర్ గిఫ్ట్ అవుతుంది. అని అన్నారు.

   న్యూ ఇయర్ గిఫ్ట్, డబుల్ బొనాంజా

  న్యూ ఇయర్ గిఫ్ట్, డబుల్ బొనాంజా

  సహ నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ కి ఏప్రిల్ 27, 2018 పెద్ద పండగ చేసుకునే రోజు. ఆ రోజు అత్యధిక థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా విడుదల చేస్తున్నాం. దానికంటే ఈరోజు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌ ఇంపాక్ట్ న్యూ ఇయర్ గిఫ్ట్ తో డబుల్ బొనాంజా ఫ‌న్స్ భావిస్తున్నారు. వక్కంతం వంశీ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ తో చాలా హ్యాపీగా ఉన్నాం. మరో కీలక మైన షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. యాక్షన్ సన్నివేశాలతో పాటు కొన్ని సీన్స్ చిత్రీకరిస్తున్నాం. అని అన్నారు.

   నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నా పేరు సూర్యలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూఏల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు నటిస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి) ఎడిటర్‌గా, రామ్ లక్ష్మణ్ ఫైట్స్, రామజోగయ్య శాస్త్రి పాటలను, రాజీవ్ రవి సినిమాటోగ్రఫిని, విశాల్, శేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందే ఈ చిత్రాన్ని కే నాగబాబు సమర్పిస్తున్నారు.
  బన్నీ వాసు సహ నిర్మాతగా, నిర్మాతగా శిరీషా శ్రీధర్ లగడపాటి, రచన, దర్శకత్వం బాధ్యతలను వక్కంతం వంశీ అందిస్తున్నారు.

  English summary
  Stylish Star Allu Arjun is a dedicated actor who gives his best to perform any kind of role. Allu Arjun exhibited his acting prowess once again with Naa Peru Surya. The film's intriguing teaser unveiled today on the eve of New Year is full of patriotism. You will only see Allu Arjun in the teaser which is high on action. The teaser starts with someone asking Allu Arjun 'who are you?' The reply from Bunny is 'I'm a soldier.' The dialogue 'Neeku Surya Ante Soldier. Kaani Prapanchaniki Surya Ante Anger' hints that Bunny will be seen as an angry soldier who can't control his an guish. The visuals also focused to display Allu Arjun’s agony. Last frames showed Allu Arjun facing punishment from his higher authorities.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more