నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా (అల్లు అర్జున్ కొత్త మూవీ ప్రారంభం)
అల్లు అర్జున్ హీరోగా రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ వారి మూవీ బుధవారం లాంచ్ అయింది. ఈ చిత్రం ద్వారా వక్కతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
హైదరాబాద్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.9 మూవీ బుధవారం ఉదయం.... సంస్థ కార్యాలయంలో ప్రారంభం అయింది. ప్రముఖ కథా రచయిత వక్కతం వంశీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా మారుతున్నారు.
ఈ చిత్రానికి 'నా పేరు సూర్య' అనే టైటిల్ ఖరారు చేశారు. నా ఇల్లు ఇండియా అనేది సబ్ టైటిల్. ఈ మేరకు టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. రామ లక్ష్మి సినీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ లగడపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

నా పేరు సూర్య
‘నా పేరు సూర్య' సినిమా దేశభక్తికి సంబంధించిన కాన్సెప్టుతో తెరకెక్కిస్తున్నారు. అందుకే సినిమా క్యాప్షన్ ‘నా ఇల్లు ఇండియా' అని పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నారు.

ముహూర్తపు సన్నివేశం
ముహూర్తపు సన్నివేశానికి అల్లు అర్జున్ తల్లి నిర్మల క్లాప్ కొట్టారు.

అల్లు అరవింద్
అల్లు అర్జున్ తండ్రి అరవింద్ కెమెరా స్విచాన్ చేశారు.

త్వరలో షూటింగ్
త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కాబోతోంది. షూటింగ్ వివరాలు అఫీషియల్ గా ప్రకటించనున్నారు.

టెక్నీషియన్స్
ఈ చిత్రానికి బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్-శేఖర్ మ్యూజిక్ అందించబోతున్నారు. రాజీవ్ రవి, రాజీవన్ లాంటి పాపులర్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











