»   » అల్లు అర్జున్ జోరు.. త్వరలోనే కొత్త సినిమా.. దద్దరిల్లే టీమ్ ఎంపిక..

అల్లు అర్జున్ జోరు.. త్వరలోనే కొత్త సినిమా.. దద్దరిల్లే టీమ్ ఎంపిక..

Posted By:
Subscribe to Filmibeat Telugu

దువ్వాడ జగన్నాథంతో రిలీజ్ సిద్ధమైన అల్లు అర్జున్ ఆదివారం 34 ఏట ప్రవేశించాడు. ఓ వైపు డీజేను రిలీజ్‌కు రెడీ చేస్తూనే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని అల్లు వారి అబ్బాయి తన సాంకేతిక నిపుణుల బృందాన్ని సిద్ధం చేసుకొన్నాడు. తదుపరి చిత్రానికి కథా రచయిత వక్కంతం వంశీ డైరెక్టర్‌గా, రాజీవ్ రవిని సినిమాటోగ్రాఫర్‌గా, సంగీత దర్శకులు విశాల్, శేఖర్ జోడిని ఎంపిక చేసుకొన్నట్టు సమాచారం.

దర్శకుడిగా వక్కంతం

దర్శకుడిగా వక్కంతం

పలు విజయవంతమైన చిత్రాలకు కథను అందించిన వక్కంత వంశీ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. కిక్, ఊసరవెళ్లి, రేసుగుర్రం, టెంపర్ లాంటి చిత్రాలకు కథను అందించాడు. గత కొద్దికాలంగా దర్శకుడిగా మారుతున్నారని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్‌ను డైరెక్ట్ చేయనున్నారని, ఆయన చిత్రానికి వంశీయే దర్శకుడిగా ఖరారు అయ్యారని వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. చివరికి వంశీ చెప్పిన కథ అల్లు అర్జున్‌కు తెగ నచ్చగంతో డైరెక్టర్‌గా చాన్స్ కొట్టేశాడు.

రాజీవ్ రవి కెమెరామెన్

రాజీవ్ రవి కెమెరామెన్

తన ప్రాజెక్ట్‌కు సినిమాటోగ్రాఫర్‌గా రాజీవ్ రవిని ఎంపిక చేసుకొన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు అల్లు అర్జున్‌ కూడా ఒకే చెప్పినట్టు తెలుస్తున్నది. రాజీవ్ రవి ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా జాతీయ అవార్డును అందుకొన్నాడు. ఆయన నటించిన కమ్మటిపాదం చిత్రానికి ఈ అవార్డు లభించింది. రాజీవ్ రవి పలు బాలీవుడ్ చిత్రాలకు సినిమాటోగ్రఫి అందించారు.

అనురాగ్ కశ్యప్

అనురాగ్ కశ్యప్

బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి పలు చిత్రాలకు పనిచేశారు. బాలీవుడ్‌లో చాందీనిబార్, దేవ్ డీ, గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్, ఉడ్తా పంజాబ్, బాంబే వెల్వెట్, లయ్యర్స్ డైస్ లాంటి చిత్రాలకు సినిమాటోగ్రఫీని అందించిన రికార్డు ఆయన పేరుపై ఉంది.

విశాల్ శేఖర్ మ్యూజిక్

విశాల్ శేఖర్ మ్యూజిక్

అల్లు అర్జున్‌ తదుపరి చిత్రానికి బాలీవుడ్‌లో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు విశాల్, శేఖర్ సంగీతాన్ని అందించనున్నారు. దస్, ఓం శాంతి ఓం, కహానీ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. ప్రస్తుతం దక్షిణాదిలో తమ సత్తా చాటడానికి సిద్ధమవుతున్నారు. గతంలో వెంకటేష్ నటించిన చింతకాయల రవి చిత్రానికి సంగీతం అందించారు. అప్పటి నుంచి మరే తెలుగు చిత్రానికి మ్యూజిక్ చేయలేదు.

మే 19న దువ్వాడ జగన్నాధం

మే 19న దువ్వాడ జగన్నాధం

గత కొన్ని సంవత్సరాలుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన నటించిన దువ్వాడ జగన్నాథం మే 19న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌లుక్ విశేష ఆదరణ లభించిన సంగతి తెలిసిందే.

English summary
Allu Arjun's next film was announced. This movie will directed by Race Gurram writer Vakkantham Vamsi, shot by Kammatipaadam director Rajeev Ravi and scored by Vishal-Shekhar, the next film starring Allu Arjun looks like a hit already.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu