»   » అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ గోపీచంద్‌తో

అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ గోపీచంద్‌తో

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాతి సినిమా ఖరారైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 'రేస్ గుర్రం' చిత్రం షూటింగుతో బిజీగా గడుపుతున్న అల్లు అర్జున్.....నెక్ట్స్ చిత్రం బలుపు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఉండబోతోందని తెలుస్తోంది. ఈచిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై దిల్ రాజు నిర్మించనున్నట్లు సమాచారం.

కొన్ని నెలల క్రితమే గోపీచంద్ బన్నీకి కథ వినిపించాడని, అయితే 'బలుపు' రిజల్ట్ కోసం వెయిట్ చేసాడని, బలుపు హిట్ టాక్ రావడంతో అతనితో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. సినిమాపై అంచనాలు పెరగాలంటే దర్శకుడికి ఉన్న పేరు కూడా ముఖ్యం కాబట్టి బన్నీఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.

ప్రస్తుతం అల్లు అర్జున్ 'రేస్ గుర్రం' చిత్రం చేస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్. ఈ మధ్య ప్రతి సినిమాలోనూ గ్లామర్ తో రెచ్చిపోతున్న శృతి హాసన్ ఈచిత్రంలో తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించనుందని అంటున్నారు. కిక్‌తో హిట్ కొట్టి స్టార్ దర్శకుడిగా మారిన సురేందర్ రెడ్డి, ఆ తర్వాత ఊసరవెల్లితో బోల్తా పడ్డాడు. అయితే ఈచిత్రంతో ఎలాగైనా హిట్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు.

రేస్ గుర్రం చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి.

English summary
As per reliable sources, Allu Arjun has signed a project with director Gopichand Malineni who recently delivered a hit for Ravi Teja as Balupu. Star Producer Dil Raju is undertaking the movie under Sri Venkateswara Creations Banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu