»   »  బన్నీ ని తాకిన "చెప్పను బ్రదర్" సెగ

బన్నీ ని తాకిన "చెప్పను బ్రదర్" సెగ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇచ్చారు . ఆ వార్నింగ్ మామూలుగా లేదు ''పవన్ ఓ శిఖరం ,ఆ శిఖరం గురించి మట్టి దిబ్బలు మాట్లాడితే ఎంత ? మాట్లాడకపోతే ఎంత ? టన్నుల కొద్దీఉన్న దమ్ము పోయి .. దద్దమ్మ లుగా మిగిలిపోతారు జాగ్రత్త '' అంటూ నేరుగా అల్లు అర్జున్ పై ఘాటు విమర్శలు చేసారు పవన్ ఫ్యాన్స్ .

తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ వారసులుగా వచ్చిన హీరోలు తమ తమ టాలెంట్ తో మెగా ఫ్యాన్స్,మాస్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇక పవన్ కళ్యాన్, రాంచరణ్, అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ బాగా పెంచేసుకున్నారు. అయితే ఇదంతా "మెగా" అన్న ట్యాగ్ లేకుంటే సాధ్య పడేదా..? ఒకవేళ సాధ్యపడినా దానికి ఎన్ని సంవత్సరాలు పట్టేది?

మెగా వారసులు కాబట్టే ఒకటి రెండు సార్లు తడబడ్డా మళ్ళీ ఆఫర్లు వచ్చాయ్, చిరు, పవన్ ల ఫేం ఉంది కాబట్టే ఓవర్ నైట్ స్టార్ లు అయిపోయారు,ఇక ఆ తరవాత సొంత గుర్తింపు కోసం ఆరాటం మొదలైంది. ఒక స్టాం లేకుండా తమకంటూ ఒక ఇమేజ్ కోసం తపన మొదలైంది. ఇక ఇప్పుడు ఆ పాత మార్క్ వద్దనుకుంటున్నారా..? లేక నిజంగానే ఇరుకుటుంబాలమధ్య దూరం పెరిగిపోయిందా..? ఇలా ఇప్పుడు సినీ అభిమానుల్లో ఇదే చర్చ... ఏదేమైనా ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల తిరుగు బాటుని తప్పుపట్టలేం అని ఫిలిం నగర్ జనాలే అంటున్నారు...

Allu Arjun's reaction, when fans asked about Pawan Kalyan, is creating Disturbance

చూడడానికి వార్నింగ్ లా అనిపిస్తున్నా.. చిరు - పవన్ లను వేరు చేయద్దంటూ అభిమానులు ఆవేదన చెందడాన్ని ఈ పోస్టర్ లో గమనించచ్చు. 'మెగా ఫ్యాన్స్ కి చిరంజీవి పవన్ కళ్యాణ్ రెండు కళ్లు.. ఇందులో ఏ కన్నుకైనా అవమానం కానీ అపాయం కానీ తలపెడితే తట్టుకోలేం' అనిరాసి తమకు మెగా ఫ్యామిలీ అంటే ఎంత ప్రేమ ఉందో అర్జున్ కి చెప్పాలన్న తపన కనిపిస్తోంది.

బన్నీ చెప్పిన 'చెప్పను బ్రదర్' అనే మాటకు పవన్ ఫ్యాన్స్ ఎంత ఆగ్రహానికి గురయ్యారో.. బన్నీపై ఎంత కోపం పెంచుకున్నారో అర్థమవుతోంది. అంతే కాదు చిరంజీవికి పవన్ పెద్దకొడుకు లాంటివాడని. అన్నయ్య వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ మొదటి నుంచి పవన్ కళ్యాన్ తన స్వశక్తితో, ప్రతిభతో పైకి వచ్చాడని..

అంతే కాదు పవన్ , పవన్ అడుగే ఓ సంచలనం.. అనే మాటలు ఆ పోస్టర్‌లో వున్నాయి. మొత్తానికి మెగా ఫ్యామిలీలో కొత్త గొడవలకు మరోసారి బీజం పడిందా... అన్న గుసగుసలు మొదలయ్యాయి.. ఈ విశయం పై బన్ని ఎలా స్పందిస్తాడో చూడాలి. లేదంటే అభిమానుల మధ్య కూడా ఈ వ్యవహారం దూరాలని పెంచే అవకాశం ఉంది..

English summary
Allu Arjun's public speech at the Sarainodu blockbuster function in Vijaywada hasn't settled down yet
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu