»   »  'సన్నాఫ్‌ సత్యమూర్తి' మ్యూజిక్ వీడియో లో ఇలా...(ఫొటోలు)

'సన్నాఫ్‌ సత్యమూర్తి' మ్యూజిక్ వీడియో లో ఇలా...(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడో తెలుసుకోవాలంటే మా సినిమా చూడండి అంటున్నారు త్రివిక్రమ్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం 'సన్నాఫ్‌ సత్యమూర్తి'. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ఈ చిత్రానికి సంభందించిన ప్రమోషననల్ స్పెషల్ వీడియో ఈ రోజు విడుదల అవుతోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్, బన్నీ కనిపించనున్నారు. ఆ ఫొటోలు మీరు ఇక్కడ చూడబోతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్ర నిర్మాత ఎస్‌.రాధాకృష్ణ మాట్లాడుతూ ''ఇంటిల్లిపాదీ చూసేలా ఈ చిత్రాన్ని మలిచారు త్రివిక్రమ్‌. బన్నీ స్త్టెల్‌, నటన అందరికీ నచ్చుతాయి. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం శ్రోతలను అలరిస్తోంది''అన్నారు.

అల్లు అర్జున్‌ హీరో. సమంత, నిత్య మేనన్‌, ఆదా శర్మ హీరోయిన్స్. రాజేంద్రప్రసాద్‌, ఉపేంద్ర, స్నేహా కీలక పాత్రలు పోషించారు. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఏప్రిల్‌ 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.


స్లైడ్ షోలో..ఆ ఫొటోలు

స్టోరీ లైన్ ఏంటి

స్టోరీ లైన్ ఏంటి

'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌.

త్రివిక్రమ్ మాట్లాడుతూ...

త్రివిక్రమ్ మాట్లాడుతూ...

ఇది కచ్చితంగా అందరికీ నచ్చే సినిమా అవుతుంది. నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారంతో ఓ మంచి సినిమా తీశాం. అడగ్గానే ఈ చిత్రంలో నటించడానికి ఒప్పుకొన్న ఉపేంద్రగారికి ధన్యవాదాలని త్రివిక్రమ్ అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ....

''మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో 'జులాయి' తర్వాత మళ్లీ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. 'జులాయి' సినిమా కన్నా పెద్ద హిట్ అవ్వాలన్న భయం, భక్తులతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమా చేశారు. మాతో కూడా అలా నటింపజేశారు. ఆ సినిమా కన్నా నాలుగింతలు బాగుంటుందీ సినిమా. నా డార్లింగ్ అల్లు అర్జున్‌తో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది'' అని తెలిపారు.

చిత్రం తెర వెనక...

చిత్రం తెర వెనక...

సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ, ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ -పి.డి.ప్రసాద్, నిర్మాత - రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్.

ఇప్పటికే..

ఇప్పటికే..

ఏప్రియల్ 9న విడుదలకు సిద్దం అవుతున్న ఈ చిత్రం రన్ టైం లెంగ్త్ మాత్రం కాస్త ఎక్కువే. 162 నిముషాలు తో చిత్రం సెన్సార్ అయింది. U/A స‌ర్టిఫికేట్ ఎటువంటి క‌ట్స్ లేకుండా రావ‌టం సంతోషంగా వుంది.తెలుగు ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించారు.

English summary
Son Of Satyamurthy movie has an ensemble star-cast including Bunny, Samantha, Nitya, Adah, Upendra, Sneha, Prakash Raj, Rajendra Prasad, Brahmi, Sampath and others, director Trivikram took his freewill to carve out a film with 162 minutes final length. Including USA premieres and other state releases, S/o Satyamurthy is ready for release on April 9, 2015.
Please Wait while comments are loading...