For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సూపర్ మచ్చి : 'సన్నాఫ్ సత్యమూర్తి' 50 డేస్ పూర్తి (పోస్టర్స్, ట్రైలర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'రేసు గుర్రం' తర్వాత అల్లు అర్జున్, 'అత్తారింటికి దారేది' తర్వాత త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా 'సన్నాఫ్ సత్యమూర్తి'. అంతేకాదు.... 'జులాయి' సినిమా తర్వాత వీరిద్దరూ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా కూడా ఇదే. ఈ స్దాయిలో ఎక్సపెక్టేషన్స్ తో వచ్చిన ఈ చిత్రం ఆ రేంజిని అందుకోకపోయినా ...పెట్టిన పెట్టుబడిని సంపాదించి, అల్లు అర్జున్ స్టామినా ఏంటో భాక్సాఫీస్ వద్ద ప్రూవ్ చేసింది. ఈ చిత్రం ఈ రోజుతో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపధ్యంలో పోస్టర్స్ విడుదల చేసారు. ట్రైలర్ కూడా కొత్తది కట్ చేసి ఫ్యాన్స్ ని ఆనందపరిచారు. ఈ ట్రైలర్ ని ఇక్కడ చూడండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  ఏప్రియల్ తొమ్మిదవ తేదీన విడుదలైన ఈ చిత్రం 57 సెంటర్లలలో(ఏపి,తెలంగాణా)లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ చిత్రం 54 కోట్లు ప్రీ రిలిజ్ బిజీనెస్ చేసింది. అయితే డిస్ట్ర్రిబ్యూటర్స్ మాత్రం ఆ స్ధాయిలో షేర్ సంపాదించుకోలేకపోయారు.

  అటు 'అత్తారింటికి దారేది'తోనూ, ఇటు 'రేసు గుర్రం'తోనూ పోల్చుకుంటే... సత్యమూర్తి కొడుకు కాస్త నిరాశ పరిచిన మాట వాస్తవమే. అయితే వేసవి సెలవుల్లో రావటం, ... ఫ్యామిలీ లుక్ ఈ చిత్రాన్ని బాగానే ఆదుకున్నాయి.

  స్లైడ్ షోలో ...50 రోజుల పోస్టర్లు...

  ఇదే ఆస్తి

  ఇదే ఆస్తి

  విలువైన మంచిమాటలే ఆస్తి అనే అంశాన్ని ఈ చిత్రంలో ప్రధానమైన అంశంగా తీసుకుని దర్శకుడు కథను రూపొందించారు.

  కాన్సెప్టు ఇదే

  కాన్సెప్టు ఇదే

  'నాన్న నాకేమిచ్చాడు' అంటూ లెక్కలేసుకొంటుంటారు తనయులు. కార్లు, బంగళాలూ, వూరవతల గెస్ట్‌ హౌస్‌లూ ఇవన్నీ కాగితాలపైనే కనిపిస్తాయి. కానీ కంటికి కనిపించని ఆస్తులు ఆయన చాలానే ఇస్తాడు. బతుకు పోరాటం నేర్పించేది నాన్నే. అంతెందుకు ఈ జీవితాన్ని ఇచ్చిందే నాన్న. హీరో విరాజ్‌ ఆనంద్‌ నమ్మిందీ అదే. సత్యమూర్తి గారబ్బాయి విరాజ్‌ ఆనంద్‌. తండ్రంటే దస్తావేజులపై కనిపించే సంతకం కాదు.. నా జీవితం అని నమ్మిన విరాజ్‌.. ఆ తండ్రి కోసం ఏం చేశాడనేదే కాన్సెప్టు

  అల్లు అర్జున్ మాట్లాడుతూ...

  అల్లు అర్జున్ మాట్లాడుతూ...

  ఇటీవల వచ్చిన 'ఇద్దరమ్మాయిలతో...' సినిమాలో రాక్ గిటార్ ప్లేయర్‌గా చేశాను. 'రేసు గుర్రం'లో మధ్యతరగతి అబ్బాయిగా చేశాను. వాటితో పోలిస్తే, 'సన్ ఆఫ్ సత్యమూర్తి'లో నాది కొంత డిగ్నిటీ ఎక్కువున్న పాత్ర. హుందాతనం నిండిన ఆ పాత్రలో కూడా వస్త్రధారణలో ఒక స్టైల్ తెచ్చేందుకు ప్రయత్నించాం.

  పైగా....

  పైగా....

  నేనెప్పుడూ ఒకటికి నాలుగు అలంకరణలతో నిండిన వస్త్రధారణ చేస్తుంటా. కానీ, పాటలు వదిలేస్తే, ఈ సినిమాలో కావాలనే అవన్నీ వదిలించుకొని, సింపుల్‌గా, సింగిల్ పీస్‌లో ఉండేలా చూశా. దాంతో, నేను కొత్తగా కనిపించాను అన్నారు.

  కేరళలో....

  కేరళలో....

  అల్లు అర్జున్ కెరీర్ లోనే అతి పెద్ద ఫ్లాఫ్ చిత్రంగా నమోదైందని సమాచారం. రెండో రోజు నుంచే కలెక్షన్స్ డ్రాప్ అవటం అక్కడ సినిమాను విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కు చెమటలు పట్టిస్తోంది.

  మరీ దారుణం...

  మరీ దారుణం...

  కేరళలో ఈ చిత్రం 71 థియోటర్లలో విడుదలైంది. కేరళ మార్కెట్ కు అది పెద్ద సంఖ్యే. అయితే తొలి రోజే చాలా నిరాశాజనకంగా ప్రారంభమైంది. కేవలం 61 లక్షలు షేర్ మాత్రమే అక్కడ మొదటి రోజు వసూలు చేసి అందరినీ నివ్వెరపరిచింది.

  ఉపేంద్ర ప్రభావం

  ఉపేంద్ర ప్రభావం

  ఈ చిత్రంలో ఉపేంద్ర కీలకమైన పాత్రను పోషించారు. ఉపేంద్ర ..కన్నడలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉంది. విబిన్నమైన చిత్రాలతో అక్కడ ఆయన హీరోగా చాలా కాలం నుంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తో కొనసాగుతున్నారు. దాంతో ఇప్పుడు సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఆయన్ని తీసుకోవటంతో ఖచ్చితంగా కలెక్షన్స్ పై ప్రబావం పడింది.

  మొదట వారమే ఇరగ తీసింది

  మొదట వారమే ఇరగ తీసింది

  కర్ణాటకలో ఈ సినిమా మొదటివారం 4.75కోట్ల రూపాయల షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. .ఇప్పటివరకూ కర్ణాటకలో మొదటివారం తెలుగు సినిమా కలెక్షన్ల విషయంలో ఈ సినిమాదే రికార్డు

  డివైడ్ టాక్ వచ్చినా

  డివైడ్ టాక్ వచ్చినా

  భారీ అంచనాల మధ్య గత వారం విడుదలైన ఈ సినిమాకు మార్నింగ్ షో నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయితే కలక్షన్స్ పై ఆ ప్రభావం మాత్రం ఎక్కడా కనపడటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం.

  ఇవే ప్లస్ లు...

  ఇవే ప్లస్ లు...

  త్రివిక్రమ్ బ్రాండ్ నేమ్, బన్నీ ఫ్యాన్ ఫాలోయింగ్, స్టార్ కాస్టింగ్, కుటుంబ సినిమా అనే ముద్ర జనాలను థియోటర్లకు టాక్ కు సంభందం లేకుండా ప్రేక్షకులను థియోటర్లకు లాక్కొస్తోంది.

  టాప్ గ్రాసర్ గా...

  టాప్ గ్రాసర్ గా...

  మెద‌టి వారం పూర్తయ్యే స‌రికి అత్తారింటికి దారేది చిత్రం త‌రువాత టాప్ గ్రాస‌ర్ గా ‘s/o స‌త్యమూర్తి నిలిచింది.

  ఆర్టిస్టులు...

  ఆర్టిస్టులు...

  సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రల్లో న‌టించి మెప్పించారు.

  English summary
  With today's run at box office, the April 9th release 'S/o Satyamurthy' hits the 50 day mark of its journey in around 57 centres across AP and Telangana.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X