»   » ‘సరైనోడు’ మరో రికార్డ్...ఇప్పటికే 90 కోట్లు!

‘సరైనోడు’ మరో రికార్డ్...ఇప్పటికే 90 కోట్లు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన 'సరైనోడు' చిత్రం వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే ఈచిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈచిత్రం వరల్డ్ వైడ్ షేర్ రూ. 74 కోట్లకు చేరుకుంది.

హిందీ శాటిలైట్ రైట్స్ తో కలిసి ఇప్పటి వరకు రూ. 90 కోట్లు వసూలయ్యాయని అంటున్నారు. సినిమా ఇంకా బాగా నడుస్తున్నందున, ఇతర మార్గాల ద్వారా వచ్చే వసూళ్లు కూడా కలుపుకుంటే నిర్మాత చేతికి రూ. 100 కోట్ల షేర్ అందడం ఖాయం అంటున్నారు.


బన్నీ కెరీర్లోనే ఇది అతిపెద్ద హిట్. ఇప్పటి వరకు బన్నీకి సంబంధించిన ఏ సినిమా కూడా ఈ రేంజిలో వసూళ్లు సాధించలేదు. 'సరైనోడు' సినిమా విజయానందంలో ఉన్న అల్లు అర్జున్ దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి ఇటీవల సింహాద్రి అప్పన్ననపు దర్శించుకున్నారు. ఈ సందర్బంగా బన్నీని చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు.


స్లైడ్ షోలో ఫోటోస్...


బన్నీ కెరీర్లోనే పెద్ద హిట్

బన్నీ కెరీర్లోనే పెద్ద హిట్

సరైనోడు చిత్రం బన్నీ కెరీర్లోనే అతిపెద్ద హిట్ చిత్రంగా నిలిచింది.


ఈ ఏడాది టాప్

ఈ ఏడాది టాప్

ఈ ఏడాది ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ‘సరైనోడు' సినిమాయే టాప్.


100 కోట్లపైగా గ్రాస్

100 కోట్లపైగా గ్రాస్

ఇప్పటికే ఈ చిత్రం 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది.


త్వరలో 100 కోట్ల షేర్...

త్వరలో 100 కోట్ల షేర్...

త్వరలో ఈ చిత్రం రూ. 100 కోట్ల షేర్ అందుకుంటుందని అంటున్నారు.


English summary
Allu Arjun Sarrainodu collections total 90 cr.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu