»   » ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము: అల్లు అర్జున్ , ఎవరికీ సెటైర్

ఉండాల్సింది బ్రాండ్ కాదు దమ్ము: అల్లు అర్జున్ , ఎవరికీ సెటైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :'ఎదుటోళ్లుతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదు.. ఇక్కడ దమ్ము..టన్నులు టన్నులు ఉంది ఇంకా' అంటూ వస్తున్నాడు 'సరైనోడు'. అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రమిది.

రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. బోయపాటి శ్రీను దర్శకుడు. అల్లు అరవింద్‌ నిర్మాత. తమన్‌ స్వరాలందించారు. ఈ చిత్రం పాటల విజయోత్సవం వైజాగ్ లో జరిగింది. ఈ సందర్బంగా ధియేటర్ ట్రైలర్ ని విడుదల చేసారు. అందులో ఈ డైలాగు హైలెట్ గా ఉంది.



అల్లు అర్జున్‌ మాట్లాడుతూ ''తమన్‌ ఎంత సాలిడ్‌గా ఉంటాడో పాటలు అంతే. ఈ సినిమాకు సరైన పాటలు అందించిన సరైనోడు తమన్‌. 'ఆర్య' సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు ఆర్‌.కె.బీచ్‌ దగ్గర నా సినిమా పాటల వేడుకో లేదంటే ఇంకేదైనా కార్యక్రమమో జరగాలనుకున్నాను.


ఈ సినిమాతో అది సాధించాను. నేను, ఆది కలసి చిన్నతనంలో కరాటే శిక్షణ తీసుకున్నాం. అలాంటి ఆదితో ఇప్పుడు సినిమా చేయడం ఆనందంగా ఉంది. ఒకవేళ ఈ సినిమా ఇతర భాషలో ఎవరైనా చేస్తే నేను ఆది పాత్ర చేస్తా. అంతగా నచ్చిందా పాత్ర.


Allu Arjun's Sarrainodu Theatrical Trailer

బోయపాటి శ్రీను హీరోను బట్టి సినిమాలు డిజైన్‌ చేస్తారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆయన కేవలం మాస్‌ డైరక్టరే కాదు అన్ని రకాల సినిమాలూ చేయగలరని మరోసారి తెలుస్తుంది.


ఈ రోజు నేనిలా ప్రేక్షకుల ముందు నిలబడ్డాను అంటే అది చిరంజీవిగారి వల్లే. నేనే కాదు పవన్‌ కల్యాణ్‌, రామ్‌చరణ్‌, శిరీష్‌, సాయిధరమ్‌తేజ్‌... ఇలా మా కుటుంబం ఎవరు వచ్చినా అది చిరంజీవిగారు వేసిన దారి వల్లే. ఆయన లేకపోతే మేం లేం'' అన్నారు.

English summary
Watch Sarrainodu Theatrical Trailer starring Allu Arjun , Rakul Preet , catherine teresa directed by Boypathi Sreenu, Music by SS Thaman from the house of Geethaarts
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu