»   » నా కొడుకు షాకిచ్చాడంటూ కంగారెత్తిపోయిన అల్లు అర్జున్!

నా కొడుకు షాకిచ్చాడంటూ కంగారెత్తిపోయిన అల్లు అర్జున్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్‌కు ఫేస్ బుక్, ట్విట్టర్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజిలో ఉందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఫేస్ బుక్ లో కోటి మందికి పైగా ఫాలోవర్స్, ట్విట్టర్లో 6 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఈ నేపథ్యంలో బన్నీ ఏదైనా మెసేజ్ పోస్టు చేస్తే నిమిషాల వ్యవధిలో వీరందరికీ చేరిపోతుంది.

ఈ రోజు ఉదయం బన్నీ ట్విట్టర్ అకౌంట్లో.... సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రానికి సంబంధించిన ఐటూన్స్ లింక్ ఒకటి పోస్టయింది. వాస్తవానికి ఈ పోస్టు చేసింది బన్నీ కాదు, అతని కుమారుడు అయాన్. ఇంకా రెండేళ్లు కూడా నిండని ఈబుడతడు సెల్ ఫోన్లతో ఓ ఆటాడుకుంటాడు. ఉదయం నాన్న ఫోన్ తో ఆడుకుంటూ సర్దార్ గబ్బర్ సింగ్ లింకును ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేసాడు.

అయాన్ చేసిన పనికి బన్నీ షాక్ అయ్యాడు. సాధారణంగా అలా చేయడానికి తనకైతే 10 నిమిషాల సమయం పడుతుందని.. కానీ అయాన్ దాన్ని సులువుగా ఎలా పెట్టాడో అంటూ బన్నీ ఆశ్చర్యపోయాడు. ఇకనుంచి అయాన్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలంటూ ట్విట్ చేశాడు.

పోస్టయింది....సర్దార్ గబ్బర్‌సింగ్ పాటలు కాబట్టి సరిపోయింది. అదే వేరెవరి పాటయినా అయితే ఏమయ్యేదోనని బన్నీ భార్య స్నేహ కూడా కాస్త కంగారు పడిపోయింది. స్లైడ్ షోలో కొడుక చేసిన నిర్వాకంపై బన్నీ ట్వీట్స్...

సర్దార్ గబ్బర్ సింగ్

సర్దార్ గబ్బర్ సింగ్


కొడుకు చేసిన పనికి షాక్ అవుతూ బన్నీ ట్వీట్....

ఎలా అంటూ ఆశ్యర్యం..

ఎలా అంటూ ఆశ్యర్యం..


ఇలా చేయడానికి నాకే 10 నిమిషాల సమయం పడుతుంది...మావాడు ఎలా చేసాడో అంటూ బన్నీ ఆశ్చర్యం.

కేర్ ఫుల్ గా ఉండాలి

కేర్ ఫుల్ గా ఉండాలి


మావాడితో ఇకపై చాలా కేర్ ఫుల్ గా ఉండాలంటూ బన్నీ ట్వీట్

సర్దార్ కాబట్టి సరిపోయింది

సర్దార్ కాబట్టి సరిపోయింది


అయాన్ పోస్టు చేసింది సర్దార్ గబ్బర్ సింగ్ పాటలు కాబట్టి సరిపోయింది...

ఇదే

ఇదే


అయాన్ ట్వీట్ చేసిన లింక్ ఇదే...

English summary
"Oh my god ! Shocking! My son was listening to songs in my phone iTunes a while ago. The next thing I see is Sardaar song in my Twitter acc. It's impossible to do it. It took my 10 mins to figure out how he did it. He does'nt know anything on the phone. Just pureeee luck. Unreal." Allu Arjun tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu