»   » అల్లు అర్జున్ 'వేదం' రిలీజ్ ఎప్పుడంటే....

అల్లు అర్జున్ 'వేదం' రిలీజ్ ఎప్పుడంటే....

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, మంచు మనోజ్, అనూష్క లీడ్ పాత్రల్లో క్రిష్ (గమ్యం ఫేమ్) రూపొందిస్తున్న 'వేదం' చిత్రం జూన్ రెండవ వారంలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే అల్లు అర్జున్, గుణశేఖర్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న 'వరుడు' చిత్రం మార్చిలో రిలీజ్ ఉండటంతో గ్యాప్ ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడుగా మాస్ క్యారెక్టరైజేషన్ తో సాగే పాత్రను చేస్తున్నారు. అనూష్క..వేశ్యగానూ,మంచు మనోజ్ రాక్ స్టార్ గానూ అలరించనున్నారు. మల్టిఫుల్ నేరేషన్ తో ఏ పాత్రకా పాత్ర మిగతా పాత్రలతో సంబంధం లేకుండా కథనంతో ఈ చిత్ర కథ సాగుతుంది. ఇక ఈ చిత్రంలో మరికొంత మంది హీరోలను గెస్ట్ స్టార్స్ గా చేయటానికి ఒప్పిస్తున్నారు. 'బిందాస్' తో ఓకే అనిపించుకున్న మంచు మనోజ్, ఇప్పటికే స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, 'అరుంధతి' చిత్రంలో ఎదిగిన అనూష్క కలిపి చేస్తున్న చిత్రం కావటంతో మార్కెట్లో మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu