»   » బన్నీ వల్లనే నితిన్ చేతిలో ‘జారి’ పడ్డ సక్సెస్!

బన్నీ వల్లనే నితిన్ చేతిలో ‘జారి’ పడ్డ సక్సెస్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : నితిన్-నిత్యా మీనన్ జంటగా కొండా విజయ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా మంచి రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. పైగా ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ సాంగ్ రీమిక్స్ చేయడం కూడా సినిమాకు బాగా ప్లస్సయింది.

నితిన్‍‌కు సక్సెస్ దక్కడం వెనక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో కొంత ఉందని మాత్రమే మనకు ఇంత వరకు తెలుసు. కానీ దీని వెనక మరో మెగా హీరో హ్యాండ్ కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్ర దర్శకుడు కొండా విజయ్ కుమార్ నితిన్ కంటే ముందు ఈ చిత్ర కథను అల్లు అర్జున్‌కి వినిపించాడట. అయితే కథ నచ్చక నోచెప్పాడట.

ఒక వేళ అల్లు అర్జున్ ఒప్పుకుని ఉంటే నితిన్‌కు ఇంత మంచి సక్సెస్ దక్కేది కాదనే వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఏది ఏమైనా బన్నీ చేతులారా జార విడుకున్న సక్సెస్‌ను నితిన్ సక్సెస్ ఫుల్ గా ఒడిసి పట్టుకున్నాడనే చెప్పాలి. శుక్రవారం విడుదలైన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం సూపర్ సక్సెస్ టాక్ వీకెండ్ బాక్సాఫీసును అదరగొట్టింది. నితిన్ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ హిట్ అనే టాక్ వినిపిస్తోంది.

సినిమాలో నితిన్, నిత్యా మీనన్ పెర్ఫార్మెన్స్, వారి మధ్యా సాగే కామెడీ రొమాంటిక్ ట్రాక్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ కావడంతో సినిమా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. విక్రమ్‌ గౌడ్‌ సమర్పణలో శ్రేష్ట్‌ మూవీస్‌ పతాకంపై నిఖితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ హిట్ తో మంచి ఊపు మీద ఉన్న నితిన్ నెక్ట్స్ మళయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన "ఉస్తాద్ హోటల్" తెలుగు రీమేక్ లో నటించనున్నాడు. పిల్లజమిందార్ ఫేం జి. అశోక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.

English summary

 Director Vijaykumar approached many heroes in Tollywood with Gundejaari Gallantayyinde script. Before reaching Nitin, stylish hero Allu Arjun is the last man to hear this script and say big no. If at all Bunny has given nod for this project, then Nitin might have missed a wonderful movie for sure.
Please Wait while comments are loading...