»   » నన్ను ఇష్టపడకపోయినా థాంక్స్.!: బన్నీ ఆవేదన ఇదీ

నన్ను ఇష్టపడకపోయినా థాంక్స్.!: బన్నీ ఆవేదన ఇదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

చాలా సంవత్సరాలుగా తనకనటూ ఒక అభిమానాన్ని ఏర్పరుచుకున్న బన్నీ కొద్ది కాలం కిందట అనాలోచనగా చెప్పిన "చెప్పను బ్రదర్" అన్న ఒక మాటకు పెద్ద మొత్తంలో యాంటీ ఫాన్స్ ను సంపాదించాడు. అసలు ఏ పరిస్థితుల్లో ఏ ఉద్దేశ్యం తో ఆ మాట అనాల్సి వచ్చిందో వివరించడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేసిన నష్టమే జరిగింది.

సంబందం లేదని చెప్పలేం

సంబందం లేదని చెప్పలేం

మన అభిమానులు ఇప్పుడు ఒక ప్రేక్షకులుగా సినిమాలు చూడటం మానేసి చాలాకాలం అయింది. మన అభిమాన హీరో సినిమా మనం చూద్దాం వేరే హీరో సినిమా ఎలా ఉన్న అంత బాగాలేదు అని ప్రచారం చేద్దాం ఇలా నడుస్తోంది. ఆ ప్రభావం టీజర్ల డిస్లైక్ లతో మొదలయ్యింది. ఇప్పుడు దువ్వాడ జగన్నధం రిజల్ట్ కీ అప్పటి బన్నీ మాటకీ సంబందం లేదని చెప్పలేం.


బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్

బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్

అయితే ఎంత నెగెటివ్ టాక్ వచ్చినా స్టైలిష్ స్టార్ దువ్వాడ జగన్నాధం మొదటిరోజు కలెక్షన్స్ ఆయన కెరీర్ మొత్తంలోనే బెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్స్ గా రికార్డు నమోదయ్యింది. మొదటిరోజు నైజాం ఏరియాలో రూ 4.85 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. ఇది నైజాం ఏరియాలో బన్నీకి అత్యుత్తమ రికార్డు. వేరే ఏరియాల విషయానికి వస్తే, డ్ఝ్ మొదటి రోజు కలెక్షన్స్ అల్లు అర్జున్ ఇంతకముందు సినిమాల మొదటిరోజు కలెక్షన్స్ ని మించి వచ్చాయి అని ట్రేడ్ వర్గాల టాక్.


ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకునేలా

ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకునేలా

అటువంటి కొన్ని సందర్భాల తరువాత భారీ అంచనాలు నడుమ విడుదలైన సినిమా దువ్వాడ జగన్నాధం. జూన్ 23 న విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లతో నడుస్తోంది. రివ్యూల ప్రభావం పెద్దగా పడలేదు కానీ ఉన్న నెగెటివ్ ఫీలింగ్ కి సినిమాలో ఉన్న లోపాలూ కారణం అయ్యి ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకునేలా తయారయ్యింది.


ఇష్టపడ్డా.. ఇష్టపడకపోయినా

ఇష్టపడ్డా.. ఇష్టపడకపోయినా

అందుకు అల్లు అర్జున్ స్పందిస్తూ.. "నేను మీలో కొంతమందికి నచ్చకపోయినా నా సినిమాను చూసి నన్ను ఇంతవాడిని చేసినందుకు థ్యాంక్స్. నన్ను ఇష్టపడ్డా.. ఇష్టపడకపోయినా.. నా సినిమా చూసినందుకు థ్యాంక్స్. అలాగే అభిమానులుకు ముఖ్యంగా తెలుగు సినిమా అభిమానులకు చాలా కృతజ్ఞతలు" అని చెప్పాడు. ప్రతి మాటా తూకం వేసినట్లు మాట్లాడి ముగించాడు. స్టైలిష్ స్టార్ నటించిన దువ్వాడ జగన్నాధం సినిమా ఇప్పుడు థియేటర్లో విడుదలై విజయాల ఖాతాలో చేరాలనే చూస్తోంది కానీ ఆ ఆశనెరవేరేలా లేదు.English summary
Allu Arjun responded to the negative campaign in style. In a recent interview, He thanked all the movie buffs, even those who doesn't like him, for watching 'Duvvada Jagannadham' in theatres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu