»   » అభిమానికి అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్ (వీడియో)

అభిమానికి అల్లు అర్జున్ సీరియస్ వార్నింగ్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

నల్లగొండ: రీసెంట్ గా చిరంజీవి తన అభిమానిని స్టుపిడ్ అని తిట్టి వార్తల్లో కి ఎక్కారు. ఇప్పుడు అదే మెగా క్యాంప్ కు చెందిన అల్లు అర్జున్ తన అభిమానికి ఒకరికి సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ ఎందుకు ఇచ్చారో..ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో క్రింద వీడియోలో చూడండి.

రెగ్యులర్ షూటింగ్ ల నుంచి దసరా పండుగకు బ్రేక్ తీసుకుని అల్లు అర్జున్ తన అత్తవారింటికి వెళ్లారు. స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామం నల్లొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లికి కుటుంబ సమేతంగా వెళ్లాడు.

ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ..అల్లు అర్జున్ ను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఇటీవల విడుదల అయిన రుద్రమదేవి సినిమాలోని గోన గన్నారెడ్డి పాత్ర డైలాగ్స్ చెప్పాలంటూ గ్రామస్తులు కోరగా... డైలాగ్స్ వినిపించి వారి ముచ్చట తీర్చాడు.

అలాగే పలువురు బన్నీతో సెల్పీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా వారిని అదుపు చేయటానికి స్నేహారెడ్డి కుటుంబసభ్యులు కష్టపడాల్సి వచ్చింది.

మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను. వీళ్లిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటోంది.

Allu Arjun Serious Warning To Fan

గీతా ఆర్ట్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. శ్రీకాంత్‌, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, కేథరిన్‌, ఆది పినిశెట్టి తదితరులపై కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. దీంతో తొలి షెడ్యూల్‌ పూర్తయింది. ఈ చిత్రం కోసం 'సరైనోడు' అనే పేరు పరిశీలిస్తున్నారు.

బన్నీ తన సినిమాల్లో స్త్టెల్‌కి ప్రాధాన్యం ఇస్తుంటారు. ఇందులోనూ విభిన్నమైన గెటప్‌లో కనిపించబోతున్నారట. యాక్షన్‌తో పాటు వినోదం, కుటుంబ బంధాలకూ ఈ చిత్రంలో ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. సంగీతం: తమన్‌

రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ..పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారని సమాచారం. పవర్‌ఫుల్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ పాత్ర చిత్రణ భిన్నకోణాల్లో సాగుతుందని తెలిసింది. బోయపాటి, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో తొలిసారిగా రానున్న ఈ చిత్రంపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి.

English summary
Allu Arjun celebrated Dussehra festival at his mother-in-law’s village in Nalgonda district. one of the fan irked Bunny and he was warned by the star for his bad behaviour in public.
Please Wait while comments are loading...