»   »  హాట్ టాపిక్ :అల్లు అర్జున్ కొత్త రికార్డ్

హాట్ టాపిక్ :అల్లు అర్జున్ కొత్త రికార్డ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అల్లు అర్జున్ కి యూత్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. దాంతో ఆయన ఏ ఇతర తెలుగు హీరో సాధించని రికార్డ్ ని ఫేస్ బుక్ లో సాధించారు. అతనికి ట్విట్టర్ ఎకౌంట్ లేకపోయినప్పటికీ తన సినీ, వ్యక్తిగత సమాచారాలని ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్ తో పంచుకుంటూంటారు. తాజాగా ఈ ఫేస్ బుక్ ఎక్కౌంట్ మిలియన్ లైక్ లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇక బన్ని ప్రస్తుతం 'రేస్ గుర్రం' సినిమా షూటింగ్ పనులలో బిజీగా వున్నాడు. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా సాగుతుంది. 'రేసు గుర్రం' పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని నిర్మాత నల్లమలుపు బుజ్జి తెలియచేసారు. జనవరి 14,2014న తమ సినిమా రిలీజ్ చేయాలనుకుంటున్నామని అన్నారు. నల్లమలుపు బుజ్జి మాట్లాడుతూ..." మీరు అల్లు అర్జున్ ని పూర్తి స్ధాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో చూస్తారు. బన్ని కెరీర్ లో మొదటి సారి పూర్తి కామెడీ తో చేస్తున్న సినిమా ఇది. సంక్రాంతికి మా సినిమా భారీ ఎత్తున విడుదల చేస్తాం ," అన్నారు.

ఈ చిత్రంలో అల్లు అర్జున్ బైక్ రేసర్ గా కనిపించనున్నారని తెలుస్తోంది. బన్నీ ఆ సీన్స్ కోసం బైక్ రేస్ ట్రైనింగ్ అయ్యినట్లు తెలుస్తోంది. ఒక్కసారి రేసు గుర్రం పరిగెట్టడం మొదలుపెట్టిందంటే విజయం సాధించేదాకా పరిగెడుతూనే ఉంటుంది. అటువంటి వేగంగా పరిగెత్తే గుర్రాన్ని చూస్తే ఎవరికైనా దాన్న ఎక్కి అందరికన్నా ముందు అనుకున్న చోటికి చేరాలని వుం టుంది. ఇదే అంశాన్ని దర్శకుడు సురేందర్‌రెడ్డి తన చిత్రంలో చూపబోతున్నారు . ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.మాటల్లో చెప్పలేనిది చూపించాం అని చెప్తున్నారు. ఈ సినిమా కొన్ని షెడ్యూల్స్ మిగిలివున్నాయి. వాటిని కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి వేగంగా పనులను పూర్తి చేస్తున్నారు.

శృతిహాసన్, సలోని హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి, కె. వెంకటేశ్వరరావు సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కథ : వక్కతం వంశీ, సంగీతం : తమన్, సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస, ఎడిటింగ్ : గౌతం రాజు, నిర్మాతలు : నల్లమలుపు శ్రీనివాస్, వెంకటేశ్వర రావు, దర్శకత్వం : సురేందర్ రెడ్డి

English summary
Allu Arjun, has been making his way into the hearts of Tollywood audiences right from the start, and with his recent hitIddarammayilatho, he has attained a much higher level. With fans counttouching the magical count of 1 Million on his Facebook Fan page, his
 stardom is simply the best among his counterparts in the industry. He
 even has the love of fans from Karnataka, Kerala and Tamilnadu, which
 makes him the most loved young actor in the South.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu