»   » అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ల మ్యారేజ్ డేట్ ఫిక్స్...అదెప్పుడంటే..

అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ల మ్యారేజ్ డేట్ ఫిక్స్...అదెప్పుడంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అల్లు అర్జున్, స్నేహా రెడ్డిల నిశ్చితార్దం ఇటీవల హైదరాబాద్ లో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక వీరి వివాహం మార్చి ఆరున జరపటానికి పెద్దలు ఫిక్స్ చేసారని అల్లు అర్జున్ ని కలిసిన మీడియాకు చెప్పారు. అలాగే ఈ పంక్షన్ ఎరేంజ్ మెంట్స్ లో ఇరువైపుల కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నారన్నారు. అలాగే పెళ్ళి సూటు కోసం డిల్లీనుంచి ప్రత్యేకంగా డిజైనర్ వస్తున్నారని అన్నారు. ఇక తనది ప్రేమ వివాహం అని మీడియాలో వచ్చిందని, అయితే అది నిజం కాదని, ఓ పార్టీలో తాము ఇద్దరం పరిచయం అయ్యామని, ఆ తర్వాత తమ అభిరుచులు కలవటంతో తమ కుటుంబ సభ్యులకు చెప్పటం వారు నిశ్చితార్దం ఏర్పాటు చేయటం జరిగిందని అని చెప్పుకొచ్చారు. ఇబ్రహీంపట్నంలో బిటెక్ చేసి అమెరికాలో ఎమ్మెస్ చేసిన స్నేహారెడ్డి తండ్రికి విద్యాసంస్థలు ఉన్నాయి. అల్లు ఆర్జున్ కు స్నేహారెడ్డితో గత సంవత్సర కాలంగా పరిచయం ఉంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu